అఫీషియల్: చరిత్ర సృష్టించిన బిందు మాధవి..ఆడపులియే బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ విన్నర్

-

బిగ్ బాస్ సీజన్ సిక్స్ OTT విన్నర్ అనౌన్స్ చేశారు హోస్ట్ నాగార్జున. శనివారం ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగగా, చివరకు నాగార్జున బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ..ఆడపులి అలియాస్ బిందు మాధవి అని ప్రకటించేశారు.

గేమ్ ను మొదటి నుంచి చాలా సీరియస్ గా ఆడుతున్న బిందు మాధవియే టైటిల్ విన్ అవుతుందని గత కొద్ది రోజుల నుంచి బీబీ లవర్స్ అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెనే విన్నర్ అని ప్రచారం కూడా చేశారు. ఈ క్రమంలోనే చాలా మంది సెలబ్రిటీలు ఆమెకు మద్దతు తెలిపారు.

బిందు మాధవికి మొదటి నుంచి ఓటింగ్ పర్సంటేజీ కూడా బాగానే ఉంది. ఇక..బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు లేడీ కంటెస్టెంట్ టైటిల్ విన్ కాలేదు. అలా బిందు మాధవి..బిగ్ బాస్ చరిత్రను తిరగరాసింది. ఫైనల్ లో అఖిల్ సార్థక్, బిందు మాధవి తలపడగా, బిందు మాధవియే విన్ అయినట్లు నాగార్జున అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. దాంతో బీబీ లవర్స్ , నెటిజన్లు బిందు మాధవికి శుభాకాంక్షలు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news