తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2,774 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

-

తెలంగాణ నిరుద్యోగులకు సర్కార్ వరుస గుడ్ న్యూస్ లను అందిస్తున్న విషయం తెలిసిందే..ఈ మేరకు ప్రభుత్వం తాజాగా మరో గుడ్ న్యూస్ ను చెప్పింది. యూనివర్సిటీల లో నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఓయూ, జేఎన్‌టీయూహెచ్‌, కాకతీయ వంటి అన్ని రకాల యూనివర్సిటీలలో నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఉన్నత విద్యాధికారులు, యూనివర్సిటీ అధికారులను ఆదేశించారు. అన్ని యూనివర్సిటీల పరిధిలో మొత్తం 2,774 నాన్‌ టీచింగ్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. వీటిని త్వరలోనే భర్తీ చేయనున్నారు..

మొత్తం ఉన్న ఖాళీలు, పూర్తీ వివరాలు..

యూనివర్సిటీ ఖాళీలు

ఉస్మానియా 2075

కాకతీయ 174

మహాత్మాగాంధీ 09

తెలంగాణ 09

శాతవాహన 58

పాలమూరు 14

పీఎస్టీయూ 84

బీఆర్‌ఏవోయూ 90

జేఎన్‌టీయూహెచ్‌ 115

ఆర్జీయూకేటీ 93

జేఎన్‌ఏఎఫ్‌యూ 53

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నాన్‌ టెక్నికల్‌లో జూనియర్‌ అసిస్టెంట్లు, ఆ పై క్యాటగిరీ పోస్టులను మాత్రమే భర్తీ చేసే అవకాశాలున్నాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ క్రమంలో ఓయూ పరిధిలో 680 పైగా జూనియర్‌ అసిస్టెంట్ల భర్తీకి చాన్స్​‍ ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు..చాలా మంది అభ్యర్థులు గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పెంచాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్ పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. అప్లికేషన్‌ల గడువు పెంపు లేదని స్పష్టం చేసింది.ఇది అప్ప్లై చేస్తున్న వారికి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి..

Read more RELATED
Recommended to you

Latest news