ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ విమానాశ్రయం నుంచి వెనక్కు రావడం లేదు. పోలీసులు ఎంత కోరినా సరే ఆయన వెనక్కు రావడానికి, హైదరాబాద్ వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. దీనితో పరిస్థితులు మళ్ళీ ఉద్రిక్తంగా మారాయి. ఉదయం విశాఖ పర్యటన కోసం చంద్రబాబు వెళ్ళారు. ఈ సందర్భంగా అక్కడ పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
చంద్రబాబు తన పర్యటన రద్దు చేసుకుని వెనక్కు వెళ్ళిపోవాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేసారు. కాలేజి విద్యార్ధులు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఇక ఆ తర్వాత పోలీసులను మీడియా సమావేశంలో చంద్రబాబు తిట్టారు. దీనితో వెంటనే ఆయన్ను అరెస్ట్ చేసి విఐపి లాంజ్ కి తీసుకువెళ్ళారు పోలీసులు. దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పర్యటన కొనసాగించవద్దు అని పోలీసులు సూచించారు.
అయినా సరే చంద్రబాబు వెనక్కు తగ్గలేదు. ఇప్పుడు పార్టీ నేతలతో విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబు సమావేశం అయ్యారు. విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలతో ఆయన భేటి అయ్యారు. పరిస్థితి, పర్యటన గురించి వారితో చర్చిస్తున్నారు. ఏ విధంగా ముందుకి వెళ్ళాలి అనే దానిపై చర్చలు జరుపుతున్నారు. ఇక విమానాశ్రయం బయట ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగారు.
దీనితో అటు కేంద్ర బలగాలు కూడా విమానాశ్రయంలో ఎం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. అటు డీజీపీ కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎటు వంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవాహ్రిస్తున్నారు. చంద్రబాబు ఈ రాత్రి ఎక్కడ ఉంటారు అనేది తెలియాల్సి ఉంది. అటు ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు కూడా పర్యటన వాయిదా వేసుకోవాలని సూచించినట్టు తెలుస్తుంది.