న్యూడిల్లీ: భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు అక్సిజన్ కొరతతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4 లక్షల 12 వేల 262 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కరోనాతో మొత్తం 3 వేల 980 మంది చెందినట్లు పేర్కొంది . దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 కోట్ల 10 లక్షల 77 వేల 410కు చేరుకున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు కరోనాతో 2 లక్షల 30 వేల 168 మంది మృతి చెందారని వెల్లడించింది. దేశంలో మొత్తం 35 లక్షల 66 వేల 398 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 1 కోటి 72 లక్షల 80 వేల 844 మంది కరోనా నుంచి రికవరీ అయినట్లు గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో తెలిపింది.
బిగ్ బ్రేకింగ్… భారత్‌పై కరోనా పంజా.. గడిచిన 24 గంటల్లో!
-