అన్నదాతలకు గుడ్ న్యూస్..!

-

రైతులకి తీపికబురు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతాయి. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక రకాల పథకాల్ని తీసుకు వచ్చిన సంగతి తెలిసినదే.

అలానే అనేక కార్యక్రమాలు చేపట్టింది ప్రభుత్వం. ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా రైతులకు సంబంధించి మరో శుభవార్త చెప్పారు మంత్రి హరీశ్ రావు. దాని కోసం పూర్తిగా చూస్తే.. సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పై సిద్దిపేట కలెక్టరేట్ నుంచి మంత్రి హరీష్ రావు అధికారుల తో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతాయని మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. ధాన్యం కొనుగోలు చేసిన రైతుల కోసం సీఎం కేసీఆర్ రూ. 26 వేల కోట్లు రెడీగా ఉంచారని హరీశ్ అన్నారు. అయితే కేవలం 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతాయన్నారు.టార్ఫలీన్, గన్ని బ్యాగుల కొరత, ట్రాన్స్‌పోర్టు వంటి ఇబ్బందులు ఏమి వుండకూడదు అని అధికారులకి చెప్పారు.

ఇది ఇలా ఉండగా రైతులు మిల్లులో ధాన్యం దించిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి అవ్వాలని….. ట్యాబ్ ఎంట్రీ పూర్తి కాగానే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని చెప్పడం జరిగింది. ధాన్యం కొనుగోలు, చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే కొనుగోలు కేంద్రం ఇంచార్జీ అధికారిదే బాధ్యత అని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news