ఎట్టకేలకు 50 రోజుల నుండి చంద్రబాబు లాయర్ చేసిన ప్రయత్నాలు నేటితో సాకారం అయ్యాయి. స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను హై కోర్ట్ ఇవ్వడంతో కాసేపటి క్రితమే రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదల అయ్యారు. ఇక జైలు దగ్గర నుండి చంద్రబాబు తాడేపల్లి లోని తన నివాసానికి డైరెక్ట్ గా తన కాన్వాయ్ లో వెళ్లనున్నారు. ఇక చంద్రబాబు తో ఈ నాలుగు వారాల పాటు ఇద్దరు డిఎస్పీ లు తన వెంటే ఉండనున్నారు. టీడీపీ నేతలు దాదాపు రెండు నెలలుగా బాబు కోసం ఎదరుచూసిన వేళ తమ కలలు ఫలించాయి. ఇక తదుపరి చంద్రబాబు ఏమి చేయనున్నారు ?
పార్టీని ముందుకు నడిపించడంలో ఎటువంటి వ్యూహాలను అమలు చేయనున్నారు లాంటి ఎన్నో సవాళ్లతో చంద్రబాబు అప్పుడే ఆలోచనలో పడి ఉంటారు. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ముందు ముందు ఏమి జరగనుందో చూడాలి.