ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ గురించి అందరికి తెలుసు.. చాలా మంది వాట్సాప్ ను వినియోగిస్తున్నారు.. సులువుగా మెసేజ్ లు, వీడియో, వాయిస్ కాల్స్ చేసుకొనే సదుపాయం ఉండటంతో ఎక్కువమంది ఈ మెసేజ్ యాప్ ను వాడుతున్నారు.. గత కొద్ది రోజులుగా ఈ యాప్ సేవలకు అంతరాయం కలిగిస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా మరోసారి ఈ సేవలకు అంతరాయం కలిగిందని తెలుస్తుంది..
భారతదేశంలోని కొంతమంది వినియోగదారుల కోసం whatsApp పనిచేయడం లేదు. డౌన్‌డెటెక్టర్ ప్రకారం, యాప్ గత రాత్రి నుండి సమస్యలను ఎదుర్కొంటోంది, ఈరోజు కూడా కొనసాగుతోంది.. యాప్‌లో స్వీకరించిన వీడియోలను డౌన్‌లోడ్ చేయలేక సమస్యను ఎదుర్కొంటున్నట్లు ట్విట్టర్‌లో బాధిత వినియోగదారులు నివేదించారు. అయితే, ఆండ్రాయిడ్ బీటా యూజర్ల లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.. మరి దీనిపై ఆ సంస్థ పూర్తి వివరాలను తెలియజేయాల్సి ఉంది..