తెలంగాణలో త్వరలో నీరా కేఫ్‌ లు ప్రారంభిస్తాం – శ్రీనివాస్ గౌడ్

-

తెలంగాణలో త్వరలో నీరా కేఫ్‌ ప్రారంభించనున్నామని, అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని టూరిజం హబ్ గా తయారు చేస్తామని ప్రకటించారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌.

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ భూములు ఇష్టానుసారంగా అనర్హులకు ధారాదత్తం చేశారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వాటిపై సమీక్షలు చేస్తున్నామని తెలిపారు. వేయి కోట్ల విలువైన భూముల ను రిటర్న్ తీసుకున్నాం.. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర గోల్ఫ్ కోర్ట్ అభివృద్ధి చెస్తాం అని 120 ఎకరాలు తీసుకున్నారని వివరించారు.

 

కానీ గోల్ఫ్ ను అభివృద్ధి చేయకుండా ఇతర పనులకు ఉపయోగిస్తున్నారు.. దానిని టూరిజం డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుందని పేర్కొన్నారు. యాత్రినివాస్ దగ్గర 100 కోట్ల విలువైన భూమిని కూడా తీసుకున్నాం.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలని చూస్తున్న భూముల ను స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. లీజ్ అమౌంట్ పే చేయని వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నాం.. ప్రభుత్వ భూములను ఇతర కార్యకలాపాలకు ఉపయోగిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version