ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివాదాస్పద ఎన్పిఆర్ పై ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. ఎన్పిఆర్ పై కొన్ని సందేహాలు ఉన్నాయని, ఎన్పిఆర్ మైనార్టీలను అభద్రతా భావానికి గురి చేస్తున్నాయని జగన్ ట్వీట్ చేసారు. దీని గురించి పార్టీలో చర్చించామని జగన్ అన్నారు. అవసరమైన మేరకు కొన్ని మార్పులు చేయడానికి కేంద్రాన్ని కోరతామని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎన్పిఆర్ కి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశ పెడతామని అన్నారు.
దీనితో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ఇన్నాళ్ళు వివాదాస్పద కేంద్ర నిర్ణయాలపై జగన్ పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు అనూహ్యంగా ఆయన ఈ విధంగా ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఇక పౌరసత్వ సవరణ చట్టం విషయంలో జగన్ ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అయిదేళ్ళ కు ఒకసారి ఎన్పిఆర్ ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ సారి చేర్చిన అంశాలు వివాదాస్పదంగా మారాయి.
To this effect, we will also introduce a resolution in the upcoming assembly session. (2/2)
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 3, 2020