బిగ్ బ్రేకింగ్; ఉత్తర కొరియ “హిట్లర్‌” కిమ్ ఇక లేరు…!

-

అమెరికా కంట్లో నలుసు, ప్రపంచ దేశాలకు కనపడని విపత్తు, చైనా కిరాయి దేశం అధినేత ఇక లేరు. ఎవరో అర్ధమయ్యే ఉంటుంది కదా… అతనే కిమ్ జాంగ్ ఉన్. ఉత్తర కొరియా అధినేత. నియంతలకు మదర్ హజ్బెండ్ అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. 2008 లో ఆ దేశానికి అధ్యక్షుడు అయిన 36 ఏళ్ళ కిమ్ నియంతలను మరిపించే విధంగా పాలన చేసాడు. మాట వినని వాళ్ళను చంపడమే అన్నట్టు వెళ్ళాడు.

భారీ ఖాయం, స్మోకింగ్ అలవాటు, గుండె సమస్యలు తీవ్రంగా కిమ్ కి ఉన్నాయి. ఇన్నాళ్ళు దేశంలో తన మాటే చెల్లాలి అనే విధంగా వ్యవహరించిన అతను తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. కరోనా వస్తే అధికారులను చంపేస్తా అని హెచ్చరించిన కిమ్ కరోన వలన ఆ దేశంలో ఎవరూ చావక ముందే అతనే చనిపోయాడు. ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతున్నాడు కిమ్. చైనా వైద్యులు వచ్చినా అతన్ని కాపాడ లేకపోయారు.

హాంగ్ కాంగ్, జపాన్ మీడియా సంస్థలు ఈ విషయాన్ని ఆధారాలతో సహా చెప్తున్నాయి. తమ దేశానికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని భావించి అతని మరణాన్ని దాస్తున్నారని చెప్పాయి. చాలా బలమైన ఆధారాలు అతను చనిపోయినట్టు ఉన్నాయని పేర్కొన్నారు. చైనా వైద్య బృందాన్ని ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌కు పంపినా ఉపయోగం లేకుండా పోయిందని చెప్పారు. జపాన్ వారపత్రిక షుకాన్ గెండాయ్ గుండె శస్త్రచికిత్స సమస్యల తరువాత అతనికి సర్జరీ చేసినా ఉపయోగం లేదని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news