ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ భేటీ అయ్యారు. ఆయనతో పాటుగా కుమారుడు అనంత్ అంబాని రాజ్యసభ ఎంపీ నత్వాని ఉన్నారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ భేటీలో పలు కీలక విషయాలను చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల ఏర్పాటు సహా పలు కీలక అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. తిరుపతిలో జియో ఫోన్ల తయారి పరిశ్రమ పెట్టాలని భావించింది రిలయన్స్.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018 లోనే ఈ నిర్ణయం తీసుకుంది రిలయన్స్. అయితే ఏమైందో ఏమో తెలియదు గాని అనూహ్యంగా నిర్ణయం మార్చుకుని కొత్త ప్రభుత్వం మారిన తర్వాత పెట్టుబడుల నుంచి తప్పుకుంది రిలయన్స్. అలాగే కాకినాడ లో కూడా సహజ వాయి నిక్షేపాలపై కూడా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయానికి వచ్చింది రిలయన్స్. వాటి నుంచి కూడా తప్పుకునే ఆలోచనలో ఉంది.
ఈ తరుణంలో ముఖేష్ అంబాని జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇవి ఎంత వరకు నిజం అనేది తెలియకపోయినా ఇప్పుడు జగన్ తో భేటీ లో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఏడాది చివర్లో రాయలసీమలో రిలయన్స్ మొబైల్స్ తయారి ప్లాంట్ ని కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉందని సమాచారం.
దీనికి సంబంధించిన రాయితీ లపై ఆయన చర్చించారని అంటున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నారు. అయితే రాజ్యసభ ఎంపీ ఎందుకు వచ్చారు అనేది అర్ధం కావడం లేదు. అంబాని వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.