గత కొన్ని రోజులుగా ఉత్కంట రేపుతున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యుల్ ని ఎన్నికల సంఘం విడుదల చేసింది. మూడు దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు అధికారులు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల ఎన్నికలకు సంబంధించిన షెడ్యుల్ ని విడుదల చేసారు. షెడ్యూల్ రిలీజ్ అవ్వడంతో… ఎన్నికల నియమావళి తక్షణం అమల్లోకి వచ్చింది. ఉద్యోగ బదిలీలపై నిషేధం అమల్లోకి రానుంది.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్ని ఒకే దశలో నిర్వహించాలనీ, సర్పంచ్ ఎన్నికల్ని రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించాలని ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తున్నందున ఎలాంటి పొరపాట్లూ లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు ఆయన.
మార్చ్ 9 నుంచీ 11 వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ
మార్చ్ 17 నుంచీ 19 వరకు పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు
మార్చ్ 21న పరిషత్ ఎన్నికలు
మార్చ్ 24న పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
మార్చ్ 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
మార్చ్ 27న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
మార్చ్ 27న మొదటిదశ సర్పంచ్ ఎన్నికలు
మార్చ్ 29 రెండో విడత సర్పంచ్ ఎన్నికలు
660 ZPTC, 9639 MPTCలకు ఎన్నికలు జరగనున్నాయి.