కాసేపటి క్రితం సొంతగడ్డపై జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ చేతిలో దారుణంగా ఓటమి పాలయ్యి ఐపీఎల్ లో మరోసారి ప్లే ఆఫ్ కు చేరకుండానే నిష్క్రమించింది. ఎన్నో ఆశలతో ఈసారైనా ఛాంపియన్ అవ్వాలని కలలు కన్న సన్ రైజర్స్ హైద్రాబాద్ కు మరోసారి నిరాశ తప్పలేదు. ఈ రోజు మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసి లక్నో ముందు పరుగులు లక్ష్యాన్ని పెట్టింది. ఈ లక్ష్యాన్ని చేధించడానికి లక్నో చాలా ఇబ్బందులు పడింది. ఇక ఫ్యాన్స్ కూడా లక్నో ఓటమి ఖాయం అనుకున్నారు. ఇంతలోనే అభిషేక్ శర్మ వేసిన ఒక్క ఓవర్ తో అంచనాలు మారిపోయాయి. అతను వేసిన ఆ ఓవర్ లో లక్నో ఏకంగా 31 పరుగులు పిండుకున్నారు.
దీనితో లక్నో విజయం ఖాయమైంది, మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్నో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో లక్నో ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశాలు బాగా మెరుగుపరుచుకుంది. కాగా SRH ఈ ఓటమితో సీజన్ నుండి ప్లే ఆఫ్ కు చేరకుండానే నిష్క్రమించింది.