ఏపీ రైతులకు బిగ్ షాక్.. రైతులపై రూ.1,91,970.26 కోట్ల రుణభారం !

-

ఏపీ రైతులకు బిగ్ షాక్. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రైతులపై ఈ ఏడాది మార్చి 30 నాటికి రూ.1,91,970.26 కోట్ల రుణభారం ఉంది. 1,34,05,372 ఖాతాల ద్వారా ఈ రుణాలు తీసుకున్నారు. తమిళనాడు తర్వాత అత్యధిక రుణభారం రాష్ట్ర రైతులపైనే ఉంది.

ఈ ఏడాది మార్చినాటికి దేశవ్యాప్తంగా బ్యాంకులో రూ.17.09 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేయగా, అందులో 46.20% మొత్తాన్ని దక్షిణాది రైతులు తీసుకున్నారు. దక్షిణాదిలో అతి తక్కువ రుణభారం తెలంగాణ రైతులపై ఉంది. 2020 తో పోలిస్తే 2022 నాటికి ఏపీలో రుణభారం 40.35% పెరగ్గా, తెలంగాణలో 30.22% వృద్ధి కనిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news