బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్.. ఆ రోజుల్లో బ్యాంకులు పని చెయ్యవు..

-

ప్రతి నెలలో బ్యాంకులకు సెలవులు ఉండటం సహజం.. ఆ రోజుల్లో బ్యాంక్ సేవలకు కూడా అంతరాయం కలుగుతుంది.ఆగస్టు నెలలో కూడా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు నెలలో ఉన్న బ్యాంకుల సెలవుల జాబితాను తాజాగా విడుదల చేసింది.

ఆర్బీఐ క్యాలెండర్  ప్రకారం ఆగస్టు నెలలో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు.గెజిట్ సెలవులు, చట్టబద్ధమైన సెలవులు, ఆదివారాల్లో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు మూసివేయనున్నారు. ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాల్లో కూడా బ్యాంకులు పనిచేయవు.ఈ సెలవులు కాకుండా వివిధ రాష్ట్రాల్లో పలు ప్రాంతీయ పండుగలు ఉన్నాయి. అటువంటి ప్రాంతీయ పండుగల సందర్భాలలో వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకుల స్థానిక శాఖలు కూడా మూసివేయనున్నారు.

ఆగస్టు నెలలో దాదాపు సగం వరకు బ్యాంకులు పనిచేయవు కాబట్టి ఖాతాదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మీరు మీ బ్యాంకు సంబంధిత పనులన్నింటినీ ప్లాన్ చేసుకోవాలని బ్యాంకింగ్ అధికారులు సలహా ఇచ్చారు. సెలవు రోజుల్లో ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న మాత్రమే దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయనున్నారు. ఇతర ప్రాంతీయ సెలవుల్లో గణేష్ చతుర్థి, జన్మాష్టమి, షాహెన్షాహి, మోహర్రం పండుగలు ఉన్నాయి..

ఇక ఆగస్టు నెలలో ఉన్న మొత్తం సెలవుల లిస్ట్ ఇదే..

ఆగస్టు 1: ఆదివారం
ఆగస్టు 8: ఆదివారం
ఆగస్టు 14: రెండవ శనివారం
ఆగస్టు 15: ఆదివారం
ఆగస్టు 22: ఆదివారం
ఆగస్ట్ 28: నాల్గవ శనివారం
ఆగస్టు 29: ఆదివారం
జాతీయ, ప్రాంతీయ సెలవులు
ఆగస్టు 1: ద్రుక్పా త్షే-జి (సిక్కిం)
ఆగస్టు 8, 9: మోహర్రం పండుగ
ఆగస్టు 11, 12: రక్షా బంధన్
ఆగస్టు 13: దేశభక్తుల దినోత్సవం
ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 16: పార్శీల నూతన సంవత్సరం (షాహెన్‌షాహి)
ఆగస్టు 18: జన్మాష్టమి
ఆగస్ట్ 19: శ్రావణ వద్/కృష్ణ జయంతి
ఆగస్టు 20: శ్రీకృష్ణాష్టమి
ఆగస్టు 29: శ్రీమంత శంకరదేవుని తిథి
ఆగస్టు 31: సంవత్సరం (చతుర్థి పక్షం)/గణేష్ చతుర్థి/వరసిద్ధి వినాయక వ్రతం/వినాయక చతుర్థి

Read more RELATED
Recommended to you

Latest news