టెన్నిస్ స్టార్ జకోవిచ్ కు బిగ్ షాక్ తగిలింది. కరోనా వ్యాక్సిన్ వేసుకోని నేపథ్యంలో..టెన్నిస్ స్టార్ జకోవిచ్ వీసాను రద్దు చేసింది ఆస్ట్రేలియా సర్కార్. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో పాల్గొనేందుకు మెల్ బోర్న్ చేరుకున్న జకోవిచ్ ను విమానాశ్రమ అధికారులు అడ్డుకున్నారు. జకోవిచ్ తగిన ఆధారలు సమర్పించలేదని.. అందుకే అతడి ఎంట్రీని అడ్డుకున్నామని ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ తెలిపింది.
దీంతో 8 గంటల పాటు జకోవిచ్ మెల్ బోర్న్ ఎయిర్ పోర్టులోనే ఉండాల్సి వచ్చింది. టెన్నిస్ దిగ్గజ ఆటగాడిని ఎయిర్ పోర్టు లో 8 గంటలకు పైగా ఆపడం పై సెర్బియా ప్రభుత్వం ఫైర్ అయింది. దిగ్గజ ఆటగాడిని అవమానించారని సెర్బియా ప్రధాని కూడా మండి పడ్డారు. కాగా.. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా జకోవిచ్ బరిలోకి దిగనున్నారు. ఇప్పిటికే 9 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా జకోవిచ్ అరుదైన ఘనత సాధించిన సంగతి తెలిసిందే.