సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీ ఆర్టీసి కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుండి ఏపిలోని అన్ని జిల్లాలకు స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 7 నుండి 14 వరకు హైదరాబాద్ నుండి ఏపీలోని 13 జిల్లాల్లోని పలు పట్టణాలకు 1500 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు హైదరాబాద్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం హైదరాబాద్ నుండి ఏపికి రెగ్యులర్ గా 344 బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సులు కూకట్ పల్లి, జీడిమెట్ల, ఈసీఐఎల్ ,జెబీఎస్, ఎల్బీనగర్ ఇతర ప్రాంతాల నుండి నడుస్తున్నాయి. ఇక సంక్రాంతి నేపథ్యంలో ఆర్టీసి స్పెషల్ బస్సులను నెల్లూరు, రాయలసీమ ,ఒంగోలు వైపుకు వెళ్లే బస్సులను ఎంజీబీఎస్ బయట ఉన్న ఓల్డ్ సీబీఎస్ హాంగర్ నుండి నడుపుతున్నట్లు తెలిపారు. అంతే కాకుండా ప్రత్యేక బస్సులకు కూడా రిజర్వేషన్ కల్పించారు.