బ్రేకింగ్‌: హ‌ర్యానాలో బీజేపీకి షాక్‌

-

మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ముందు నుంచి జోరుమీదున్న క‌మ‌లానికి హ‌ర్యానాలో కాస్త షాక్ త‌గిలింది. ఐదారు రౌండ్లు కంప్లీట్ అయ్యే స‌రికి అక్క‌డ పార్టీ అభ్య‌ర్థులు వెన‌క‌ప‌డ్డారు. హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏ పార్టీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కన్పించడం లేదు. భారతీయ జనతా పార్టీ హర్యానాలో 39 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 32 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

ఇక్కడ ఇతర పార్టీ నేతలు కీలకంగా మారనున్నారు. బీజీపీ ఇక్కడ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేవన్నది స్పష్టమవుతుంది. కౌంటింగ్ సరళి నువ్వా? నేనా? అన్నట్లు కొనసాగుతోంది. ఇక్క‌డ ప‌రిస్థితి ఒక్క‌సారిగా ట‌ర్న్ అయ్యింది. ఇక ప‌లువురు కేబినెట్ మంత్రులు వెన‌క‌ప‌డిపోయారు. హర్యానాలో మాత్రం బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది. దీంతో ఎలెర్ట్ అయిన అమిత్ షా అక్క‌డ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు అక్క‌డ‌కు బ‌య‌లు దేరి వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news