హైకోర్టులో సిద్దిపేట మాజీ కలెక్టర్ కు బిగ్ షాక్.. క్షమాపణలు చెప్పాల్సిందే !

తెలంగాణ హై కోర్ట్ లో సిద్దిపేట మాజీ కలెక్టర్, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి కి ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. వెంకట రామరెడ్డి సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న సమయంలో కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.

వరి ధాన్యం వేయొద్దని… కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్న పట్టించుకో బోమని గతంలో వెంకటరామిరెడ్డి వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో సింగిల్ జడ్జి సిఫారస్ చేసిన పిటిషన్ పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ వెంకట్రామిరెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు క్షమాపణ చెప్పాలని కూడా పేర్కొంది. అయితే దీనిపై ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ …. వెంకట్రామిరెడ్డి తో క్షమాపణలు చెప్పి ఇస్తామని కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కోర్టు విచారణను… హైకోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.