దేవుడి దయ వల్ల తెలంగాణ అభివృద్ధి జరిగింది : ఏపీ మంత్రి బుగ్గన

ఇవాళ శాసన మండలిలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సమగ్రాభివృద్ధి రద్దు బిల్లు మండలిలో ప్రవేశపెట్టారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం చట్టం తీసుకొచ్చామని పేర్కొన్నారు. హైదరాబాద్ కేంద్రం గా అభివృద్ధి జరగడం వల్ల విభజన సమస్య వచ్చిందని గుర్తు చేశారు. దేవుడి దయ వల్ల తెలంగాణ అభివృద్ది చెందిందని.. ఎక్కడా వెనకపడలేదని వెల్లడించారు మంత్రి బుగ్గన.

అభివృద్ధి చెందనిది తెలంగాణ రాష్ట్రం కాదు….రాయలసీమ, ఉత్తరాంధ్ర అని వెల్లడించారు మంత్రి బుగ్గన. BHEL వంటి కేంద్ర సంస్థలన్నీ హైదరాబాద్ లోనే స్థాపించారన్నారు. ఇతర రాష్ట్రాల్లో కేంద్ర సంస్థలు మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మరింత మంది తో చర్చలు జరిపి అందరికీ ఆమోదంగా ఉండేలా కొత్త బిల్లు తీసుకోస్తామని ప్రకటన చేశారు మంత్రి బుగ్గన. మూడు రాజధానుల విషయం తాము తగ్గబోమని స్పష్టం చేశారు మంత్రి బుగ్గన.