తెలంగాణ రైతులకు బిగ్ షాక్.. యాసంగిలో వరికి వేయద్దని ఆదేశాలు !

-

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి  కీలక ప్రకటన చేశారు. యాసంగి కాలంలో వరి వేయవద్దని తెలంగాణ రాష్ట్ర రైతులను కోరారు మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ రైతాంగం వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు మంత్రి నిరంజన్ రెడ్డి.

యాసంగి లో వారి వేసి మోసపోవద్దని పేర్కొన్న మంత్రి నిరంజన్ రెడ్డి… రైతులు అలాగే పేదల ప్రయోజనాలు పట్టకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్ వేదికగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవాస్తవాలు మాట్లాడారని నిప్పులు చెరిగారు. యాసంగి లో వారికి బదులు ఇతర పంటలు వేసుకోవాలని.. తెలంగాణ రైతాంగానికి మరోసారి విన్నపం అంటూ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. యధావిధిగా వానకాలం పంట కొనుగోలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఇతర పంటల సమాచారం అందిస్తున్నామని పేర్కొన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ రైతాంగం రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news