భూముల వేలం : కేసీఆర్ సర్కార్ కు దిమ్మతిరిగే షాక్‌

-

హైదరాబాద్‌ ; కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవలె భూముల వేలం కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే..తాజాగా ఈ భూముల వేలం పై కేసీఆర్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఖానామెట్ లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని హైకోర్టు ఆపాలని ఆదేశాలు జారీ చేసింది.

cm-kcr
cm-kcr

ఖనామెట్ లో గొల్డెన్ మైల్ లోని 15 ఎకరాలను వేలం వేసింది తెలంగాణ సర్కార్. అయితే.. ఈ 15 ఎకరాల్లో మూడెకరాల స్మశానం ఉండగా… ఆ స్మశాన స్థలాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెట్టింది. దీంతో స్మశాన వేళాన్ని ఆపాలంటూ హైకోర్టులో అక్కడి స్థానికుల పిటిషన్ దాఖలు చేశారు.

తమ పూర్వికుల సమాధులున్నాయని కోర్టుకు పిటిషన్‌ లో నివేదించారు స్థానికులు. తాము సెంటిమెంట్ గా భావించే సమాధులను పరిరక్షించాలని హై కోర్టుకు విన్నవించారు స్థానికులు. దీనిపై స్పందించిన తెలంగాణ హై కోర్టు… తాత్కాలికంగా స్మశాన వేలాన్ని నిలిపివేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news