ఆంధ్రప్రదేశ్ శాసన మండలి పరిణామాలు ఉత్కంఠగా మారాయి. ఉదయం నుంచి రెండుసార్లు వాయిదా పడిన శాసనసభ మండలిలో చైర్మన్ తీరుపై మంత్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంప్రదాయానికి చైర్మన్ తెరతీశారని మండిపడుతున్నారు. చైర్మన్ ప్రభుత్వ బిల్లులు పక్కనపెట్టి టీడీపీ నోటీసు చర్చకు తీసుకున్నారు. వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టగా ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ రూల్ 71 ప్రవేశపెట్టింది.
దీనిపై అధికార పార్టీ ఇచ్చిన వికేంద్రీకరణ బిల్లుపై చర్చను ఏ మాత్రం చైర్మన్ లెక్కచేయకుండా ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నోటీసుపై స్పందించి చర్చకు ఆహ్వానించారు. ఒకవేళ రూల్స్ 71కి వెళితే మాత్రం వికేంద్రీకరణ నెలపాటు వాయిదా పడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మండలిలో వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఏమాత్రం కనబడటం లేదు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
దీనిపై శాసన సభలో జగన్ మాట్లాడుతూ శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లుని అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ చూస్తుందని, ఎస్సీ కమీషన్ బిల్లుని కూడా అడ్డుకోవాలని తెలుగుదేశం ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. తెలుగుదేశం సభ్యులు ఎం చేస్తున్నారో వాళ్ళకే అర్ధం కావడం లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. బిల్లు పాస్ కాకుండా చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీ చూస్తుందని జగన్ మండిపడ్డారు.