తెలంగాణా గ్రామాల్లో పెద్ద పులులు…!

-

అదేంటి అంటారా…? అవును ఇది నిజం. తెలంగాణకు మహారాష్ట్ర పులులు వస్తున్నాయి అందుకే. పదుల సంఖ్యలో పులులు తెలంగాణా అడవుల్లోకి అడుగు పెడుతున్నాయి. మహారాష్ట్రలో అడవుల విస్తీర్ణం తగ్గిపోతున్న నేపధ్యంలో అక్కడి నుంచి తెలంగాణకు వస్తున్నాయి. మహరాష్ట్ర తెలంగాణా సరిహద్దుల్లో పదుల సంఖ్యలో పెద్ద పులులు తెలంగాణా అడవుల్లోకి అడుగుపెడుతున్నాయి.

మహారాష్ట్ర చత్తీస్ఘడ్ అడవుల విస్తీర్ణం సరిపడక తెలంగాణా అడవుల్లోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు 20 పులుల వరకు తెలంగాణా అడవుల్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా అదిలాబాద్ జిల్లాలోని మాహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పులులు ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. పచ్చని అడవులు ఉండటం, గ్రామాలు కూడా పచ్చగా ఉండటంతో ఒక్కో పులి ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి.

తిప్పెస్వర్, తడోబా నుంచి తెలంగాణా అడవుల్లోకి వస్తున్నాయి. ఎత్తైన కొండలు ఉండటం, పచ్చగా అడవులు ఉండటంతో పులులు తెలంగాణా బాట పడుతున్నాయి. దీనితో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొత్త పులిని గుర్తించగానే అటవీ శాఖ కొత్త చర్యలు చేపడుతుంది. దీనితో గ్రామాల్లో ఇప్పుడు భయం భయంగా గడుపుతున్నారు. అదిలాబాద్ లోని ప్రాణహిత పరివాహక ప్రాంతంలో అటవీ భూమి ఎక్కువగా ఉంది.

దీనితో అక్కడికి ఎక్కువగా వస్తున్నాయి. రాత్రి సమయాల్లో పెద్ద పులులు గాండ్రిస్తూ ప్రజలను భయపెడుతున్నాయి. దీనితో ప్రజలు పొలాలకు వెళ్ళాలి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. పశ్వులను కూడా అవి చంపి తినేస్తున్నాయి. దీనితో జీవనాధారం కూడా కోల్పోతున్నారు అక్కడి ప్రజలు. అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పులులను వాటి ద్వారా ట్రాక్ చేస్తున్నారు. కాగజ్ నగర్ కారిడార్ పులులకు ఆవాసంగా మారుతుంది. ఇక కవ్వాల్ టైగర్ జోన్ పులులకు సేఫ్ జోన్ గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news