వైసీపీ ఫోన్లను ట్యాప్ చేసిన ఏబీ, అందుకే జగన్ టార్గెట్ చేసారా…?

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం ఇప్పుడు చినికి చినికి గాలి వానగా మారడంతో పాటుగా అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. తమ ఫోన్ లను అప్పుడు ఏబీ ట్యాప్ చేసారని ఆయన అన్నారు.

అదే విధంగా ఎమ్మెల్యేల కొనుగోళ్ళు విషయంలో కూడా ఏబీ చంద్రబాబుకి సహకరించారని మాట్లాడారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వాస్తవానికి ఏబీపై గతంలో కూడా ఇవే ఆరోపణలు వచ్చాయి. ఆయన ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో చంద్రబాబుకి అన్ని విధాలుగా సహకారం అందించారు అంటూ అప్పట్లో వైసీపీ నేతలు ఆరోపణలు కూడా చేస్తూ వచ్చారు.

అప్పుడు ఏబీ చేసిన వ్యవహారాలూ అన్నీ కూడా జగన్ సర్కార్ సైలెంట్ గా విచారణ చేస్తూ వస్తుంది. అందుకే ఆయన్ను పక్కా ఆధారాలతో సస్పెండ్ చేసింది అంటున్నారు. న్యాయవస్థ నుంచి ఏ ఇబ్బందులు రాకుండా జగన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే పక్కకు తప్పించారని అంటున్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్న రోజా, కొడాలి నానీ, అనీల్ కుమార్ యాదవ్,

రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, లోక్సభ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాచర్ల ఎంపీ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సహా కొందరి నేతలను టార్గెట్ చేసి అప్పట్లో ట్యాప్ చేసారని అంటున్నారు. దీనితోనే జగన్ ఇప్పుడు ఏబీ ని తప్పించారని అంటున్నారు. అదే విధంగా ఎన్నికల్లో తనను ఇబ్బంది పెట్టడానికి కూడా ఏబీ కుట్ర చేసారనే సమాచారం జగన్ కి అందింది అంటున్నారు. అందుకే ఈ చర్యలు తీసుకున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news