సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో షాలిని అనే యువతి కిడ్నాప్ కేసు ఊహించని మలుపు తిరిగింది. తాను ఇష్టపూర్వకంగానే జానీ అనే యువకుడితో వెళ్లినట్లు శాలిని వీడియో రిలీజ్ చేసింది. జానీని పెళ్లి చేసుకున్నట్టు చెప్పింది.
నాలుగేళ్ల నుంచి ప్రేమలో ఉన్నామని, తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే జానీతో వెళ్లానని తెలిపింది. తల్లిదండ్రుల నుంచి ప్రాణభయం ఉందని పేర్కొంది. తమను పోలీసులే కాపాడాలని శాలిని ఓ వీడియో ద్వారా తెలిపింది.
కాగా, సిరిసిల్ల మూడపల్లి యువతి జ్యోతి కిడ్నాప్ ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. కిడ్నాప్ వ్యవహారంపై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేను ఆరా తీసిన మంత్రి.. నిందితుల్ని సాయంత్రంలోగా పట్టుకోవాలని ఆదేశించారు. కానీ అంతలోనే కిడ్నాప్ అయినా యువతి పెళ్లి చేసుకున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేయడం గమనార్హం.