పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు డబల్ బొనాంజా..!!

-

పవన్ కళ్యాణ్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.తన యాక్టింగ్, స్టైల్ తో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కొన్ని రోజులు రాజకీయాలలో కొన్ని రోజులు సినిమాలు చేస్తూ వస్తున్నాడు.ఇప్పుడు పవన్ కళ్యాణ్  ”హరిహర వీరమల్లు”. ఈ సినిమా లో నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా ఎప్పటి నుండో షూటింగ్ జరుపు కుంటూనే వుంది. పవన్ రాజకీయాల వల్ల అడ్డంకి  ఎదురవుతూనే ఉంది.పవన్ కళ్యాణ్ కూడా సినిమాని తొందరగా పూర్తి చేయాలని పట్టు దలతో వున్నాడు. ఎందుకంటే తనకు ఏ వ్యాపారం లేదు, సినిమాల్లో వచ్చిన డబ్బులతో ప్రచారం చేసుకోవాలి.అందుకే  ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు సుజిత్ మరియు హరీశ్ శంకర్ ల సినిమాలు కూడా ఒప్పుకున్నాడు. ప్రస్తుతం”హరిహర వీరమల్లు సినిమా గురించి ఫ్యాన్స్ మజా చేసుకొనే న్యూస్ వచ్చింది.

ఈ సినిమా కి సంబంధించిన గ్లింప్స్ ను డిసెంబర్ 31, 2022 న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే రోజున పవర్ స్టార్ ఖుషీ సినిమా రీ రిలీజ్ కానుంది. అయితే ఈ ఖుషీ చిత్రం తో పాటుగా మేకర్స్ గ్లింప్స్ ను విడుదల చేసే ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే నిజం అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు డబల్ బొనాంజా దొరికినట్లే.ఇక డిసెంబర్ 31 రాత్రి మైకులు పగిలి పోయేలా సౌండ్ ఉండబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news