KGF 2 : కేజీఎఫ్ నుంచి పోస్టర్ రిలీజ్.. మాస్ లుక్ లో రాకీ భాయ్

-

కేజీఎఫ్‌ – 2 గురించి సౌత్‌ ఇండియా ఎంతగా ఎదురు చూస్తుందో అందరికీ తెలిసిందే. కేజీఎఫ్‌ – 1 ఎంత పెద్ద విజయం సంపాదించిందో చూశాం. ఆ సినిమా రికార్డులు తిరగరాసింది. ఒక రకంగా చెప్పాలంటే సినీ ప్రపంచంలో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసింది కేజీఎప్‌ -1. . సినిమాలో ద‌మ్ముంటే క‌ల‌క్ష‌న్ల వ‌ర్షం కురుస్తుంద‌ని నిరూపించింది. య‌ష్‌కు నేష‌న‌ల్ స్టార్ డ‌మ్ తీస‌సుకొచ్చింది.

ప్రస్తుతం య‌ష్ చాప్టర్ 2లో న‌టిస్తున్నాడు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్‌ వచ్చింది. హీరో యశ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌ లో యశ్‌… చాలా పవర్‌ ఫుల్‌ గా కనిపించాడు. డేంజర్‌ బోర్డు ముందు నిల్చోని… అందరినీ భయపెట్టిస్తున్నాడు. అలాగే.. ఏప్రిల్‌ 14 వ తేదీనే కేజీఎఫ్‌ – 2 విడుదల కానున్నట్లు మరోసారి స్పష్టం చేసింది చిత్ర బృందం. ఇక ఈ అప్డేట్‌ తో..హీరో యశ్‌ ఫ్యాన్స్‌ లో నూతన ఉత్సాహం నెలకొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news