బిగ్‌బాస్ 4: అఖిల్ .. సోహైల్ మ‌ధ్య వార్!

-

హెల్త్ కార‌ణాల వ‌ల్ల నోయెల్ వెళుతూ వెళుతూ బిగ్‌బాస్ హౌస్‌లో నిప్పు రాజేశాడు. నేను బ‌య‌ట వున్నా నా ముగ్గురు ఫ్రెండ్స్ అభిజిత్‌, హారిక‌, లాస్య‌ల‌కు స‌పోర్ట్ చేస్తాన‌ని ఓపెన్‌గా చెప్పేశాడు. అంతే కాకుండా అభిజిత్ నేను బ‌య‌ట నీ కుడి భుజంగా ప‌ని చేస్తాన‌ని చెప్ప‌డంతో హౌస్‌లో అస‌లు ర‌చ్చ ప‌తాక స్థాయికి చేరింది. నోయెల్ కు అండ‌గా అభిజిత్ నిల‌వ‌డంతో అమ్మా రాజ‌శేఖ‌ర్‌, అవినాష్ ఈ ఇద్ద‌రూ అభిజిత్‌ని, హారిక‌ని టార్గెట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా నామినేట్ చేసే స‌భ్యుడి త‌ల‌పై గుడ్డు బ్రేక్ చేసి రీజ‌న్ చెప్పాలి. ఈ ప్ర‌క్రియ‌లో అవినాష్ అభిని, హారిక‌ని నామినేట్ చేయ‌డం, ఆ త‌రువాత అభి అవినాష్‌ని, అమ్మ రాజ‌శేఖ‌ర్‌ని నామినేట్ చేయ‌డం ర‌చ్చ ర‌చ్చ‌గా మారింది. ఓ ద‌శ‌లో అభి, అమ్మాల మ‌ధ్య తీవ్ర వాగ్వివాదం సాగింది. ఆ త‌రువాత అఖిల్ ఇంట్లో వుండాలంటే అర్హ‌త వుండాలి. పోతా పోతా మీరే ప‌ది సార్లు అంటుంటారు. కాబ‌ట్టి వెళ్ల‌డానికి మీరు రెడీ అయితే పంపించ‌డానికి నేను రెడీ అని అఖిల్ అమ్మాతో అన‌డం హౌస్‌ని హీటెక్కించింది. ఈ నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో అభిజిత్‌, అమ్మా రాజ‌శేఖ‌ర్‌, అవినాష్‌, హారిక‌, మోనాల్ నామినేట్ అయ్యారు.

అయితే దీంతో నామినేష‌న్ ప్ర‌క్రియ పూర్తి కాలేద‌ని ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ నామినేట్ అయిన వారు టీ స్టాండ్‌పై త‌ల పెట్టాలి. వీరిని అఖిల్, సోహైల్‌, అరియానా, మెహ‌బూబ్, లాస్య డిస్ట్ర‌బ్ చేయాలి. దాన్ని త‌ట్టుకుని వున్న ఆవాళ్లకు ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ల‌భిస్తుంది. ఈ టాస్క్‌లో సోహైల్‌, మెహ‌బూబ్ అమ్మ రాజ‌శేఖ‌ర్‌ని స‌పోర్ట్ చేస్తూ మిగ‌తా వారికి చుక్క‌లు చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ఓ ద‌శ‌లో మోనాల్‌కి టార్చ‌ర్ చూపించారు. దీంతో అఖిల్‌కి సోహైల్‌కి మ‌ధ్య వాగ్వివాదం న‌డిచింది. ఒక ద‌శ‌లో స‌హనం కోల్పోయి సోహైల్‌ని అఖిల్ ఎవ‌డు స్టార్ట్ చేసిండు బే అని అన‌డంతో షో మ‌రింత హీటెక్కింది. ఇంకోసారి బే అనొద్ద‌ని సోహైల్ వార్నింగ్ ఇవ్వడంతో స‌ద్దుమ‌నిగింది. టార్చ‌ర్ పీక్స్‌కి చేర‌డంతో అభిజిత్ ఇది అన్‌ఫేయిర్‌.. స‌హ‌నానికి.. టాస్క్‌కీ హ‌ద్దుంటుంద‌ని త‌ను త‌ప్పుకుంటున్నాన‌ని చెప్పి షాకిచ్చాడు. టాస్క్ ముగిసే స‌మ‌యానికి ఇద్ద‌రికి మించి స‌భ్యులు టీ స్టాండ్‌పై వుండ‌టంతో ఎవ‌రీక ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ల‌భించ‌లేద‌ని బిగ్‌బాస్ తేల్చేయ‌డంతో అంతా ఉసూరు మ‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news