నవంబర్ 4 బుధవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

నవంబర్‌-4- ఆశ్వీయుజమాసం- బుధవారం

మేష రాశి: ఈరోజు పిల్లల వల్ల ఆనందాన్ని పొందుతారు !

ఈరోజు అనుకూల వాతావరణం. వృత్తిలో సానుకూల మార్పులు జరగవచ్చు. పనిపై ఆసక్తి చూపిస్తారు. తల్లి, తండ్రి మార్గదర్శకత్వంతో ప్రయోజనం పొందుతారు. పిల్లల వల్ల ఆనందంగా ఉంటారు. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం. స్నేహితులతో విభేదాలు రావచ్చు. చదవుకునే వారికి అడ్డంకులు రావచ్చు కృషితో అధిగమించండి. ఈరోజు అన్ని విషయాలలో మంచిగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

పరిహారాలుః నవగ్రహస్తోత్రం పారాయణం చేయండి.

todays horoscope

వృషభరాశి: ఈరోజు మానసిక శాంతి లభిస్తుంది !

ఈరోజు ఆనందంగా గడుపుతారు. పెద్దల సలహాలు, సూచనలు తీసుకుని పనులు చేయండి. దీనివల్ల విజయం సాధిస్తారు. ఆఫీస్‌లో ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ఇంట్లో తల్లి లేదా తండ్రి ఆరోగ్యం జాగ్రత్త. ఒక వార్త కుటుంబానికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఈరోజు మానసిక శాంతి లభిస్తుంది. అదృష్టం బాగుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీదుర్గా సూక్తం వినండి లేదా చదవండి. మంచి ఫలితాలు వస్తాయి.

 

మిథునరాశి: ఈరోజు వ్యాపారంలో విజయం !

ఈరోజు వ్యాపారస్తులకు భాగస్వాముల మద్దతు లభిస్తుంది. రాజకీయరంగలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.

ఈరోజుపాత బాకీలు తీర్చే అవకాశం కన్పిస్తుంది. కొత్త ఒప్పందాలకు అవకాశం ఉంది. విదేశాలకు సంబంధించిన పనులు లేదా వ్యాపారంలో విజయం. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. దీనివల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. ఈ రోజు మీకు కుటుంబ జీవితం సాఫీగా, సంతోషంగా సాగిపోతుంది.

పరిహారాలుః ఇష్టదేవతరాధన చేయండి.

 

​కర్కాటకరాశి: ఈరోజు విజయం సాధిస్తారు !

ఈరోజు మీరున్న రంగంలో మార్పులు జరగవచ్చు. దీనివల్ల మీకు సానుకూల ఫలితాలు వస్తాయి, విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. పెండ్లికాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టమైన వారితో ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః బుధగ్రహ ఆరాధనచేయండి. కుటుంబ అనుకూలత పెంచుకోండి.

 

​సింహరాశి: ఈరోజు అనుకూల ఫలితాలు సాధిస్తారు !

ఆఫీస్‌లో కష్టపడి పనిచేయడం ద్వారా అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఈ రోజు ఆత్మసంతృప్తి పొందుతారు. కుటుంబ సభ్యుల సలహా వల్ల భవిష్యత్తులో ప్రయోజనం అందుకుంటారు. ఈరోజు మీ తెలివితేటలతో సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఉపాధి రంగంలో కొంత అస్థిరత కానీ నిలదొక్కుకుంటారు. అదృష్టం కలసివస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.

పరిహారాలుః దుర్గాదేవి ఆరాధన చెప్పుకోతగ్గ సూచన.

 

​కన్యరాశి: ఈరోజు ఆఫీస్‌లో తోటి ఉద్యోగుల మద్దతు !

ఈరోజు మీ వృత్తిలో సమస్యలు, అడ్డంకులు రావచ్చు జాగ్రత్త. ఉదయం నుంచి మీ చుట్టూ ఉన్న వాతావరణం సంతోషంగా ఉంటుంది. మీరు ఎంచుకున్న రంగంలో మార్పులు. కానీ దీనివల్ల ప్రయోజనాలు పొందుతారు.  ఆఫీస్‌లో తోటి ఉద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు కష్టాల నుంచి ఉపశమనం. కుటుంబ వాతావరణం ఆహ్లదకరంగా ఉంటుంది. ఈ రోజు మీకు కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది.

పరిహారాలుః నవగ్రహస్తోత్రం పారాయణం చేయండి.

 

​తులారాశి: ఈరోజు గౌరవమర్యాదలు పెరుగుతాయి !

ఈరోజు వ్యాపారంలో వృద్ది. పెద్ద/ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోండి. కొత్త వాహనాలు కొనే అవకాశం ఉంది.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

పరిహారాలుః శివారాధన చేయండి. సానుకూల ఫలితాలను  పొందండి.

 

​వృశ్చికరాశి: ఈరోజు సంతోషకరమైన వార్త వింటారు !

సంతానం నుంచి సంతోషకరమైన వార్తలను వింటారు.  ఈ రోజు ఆనందంగా ఉంటుంది. మీరు కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది. విద్యారంగంలో విద్యార్థులకు గౌరవం లభిస్తుంది, విజయాలు అందుకుంటారు. వ్యాపారంలో అదృష్టం లభిస్తుంది. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి అనుకూల సమయం. ఈ రోజు వైవాహిక జీవితంలో సానుకూలంగా ఉంటుంది

పరిహారాలుః శ్రీసరస్వతిమాత ప్రార్థన, పూజ చేయండి.

 

​ధనస్సురాశి: ఈరోజు మిశ్రమఫలితాలు ఉంటాయి !

ఈరోజు కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. వ్యాపారంలో అనూహ్యకరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. మీరు పాత బాకీల నుంచి విముక్తి లభిస్తుంది. మీరు ఎంచుకున్న రంగంలో లాభాలు వస్తాయి. ఇంటికోసం షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.

పరిహారాలుః శ్రీసూక్తపారాయణం చేయండి. అనుకూల ఫలితాలనుపొందండి.

 

​మకరరాశి: ఈరోజువ్యాపారంలోకొత్త పెట్టుబడులు వస్తాయి !

ఈరోజు కుటుంబంలో వ్యవహారాలు సానుకూలం. బంధువులు రాక. ఈరోజు ఎవరికి అప్పులు ఇవ్వకండి. కొత్త ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. తల్లిదండ్రుల సహకారంతో కుటుంబ బాధ్యతలు గట్టుఎక్కుతారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు లాభిస్తాయి. విద్యారంగంలో విద్యార్థులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రోజు వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది.

పరిహారాలుః బుధగ్రహానికి పూజ, ప్రార్థన చేయండి.

 

​కుంభరాశి: ఈరోజు విజయం సాధిస్తారు !

ఈవ్యాపారంలో ప్రత్యర్థులు వెనకంజలో ఉంటారు. రాజకీయ రంగంలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యాలయంలో/ఆఫీస్‌లో సమస్యల నుంచి విముక్తి. కుటుంబంలో సంబంధాలు  మెరుగుపడతాయి. ఈరోజు నూతన ఉత్సాహాన్ని పొందుతారు. అనారోగ్యం నుంచి విముక్తి లభిస్తుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీదక్షిణామూర్తి సూక్తం పారాయణం చేయండి. అనుకూల ఫలితాలను పొందండి.

 

​మీనరాశి: ఈరోజు పాతబాకీలు వసూలు అవుతాయి !

పాత బాకీలు వసూలు అవుతాయి. ఉపాధికి సంబంధించిన శుభవార్త అందుకుంటారు. వ్యాపార ఒప్పందాలు. విజయవంతమవుతాయి. వివాహ విషయాలల్లో కుటుంబం నుంచి మద్దతు ఉంటుంది. ఆకస్మికంగా బంధువుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. మీ పిల్లల నుంచి శుభవార్తల పొందుతారు. ఈరోజు కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. అదృష్ట శాతం ఎక్కువగా ఉంది.

పరిహారాలుః అనుకూల వాతావరణం పెరగడానికి శ్రీకాలభైరవాష్టకం పారాయణం చేయండి.

-శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news