Bigg Boss: నాకు దొంగాట‌లు రావు.. నేను డ్రామా క్వీన్‌ను కాదు..యానీ మాస్టర్ ఉగ్రరూపం!

-

Bigg Boss: బుల్లి తెర ప్రేక్ష‌కుల‌కు పుల్ మీల్స్ ఎంట‌ర్టైన్ మెంట్ ను అందిస్తుంది బిగ్ బాస్ షో. నానా ర‌చ్చ చేస్తూ.. బిగ్ బాస్ షో విజ‌యవంతంగా ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఎప్ప‌టిలాగానే సోమ‌వారం నామినేష‌న్స్ తో హీటెక్కిన హౌస్ ను చల్లబ‌రిచేందుకు ట్రై చేశాడు బిగ్ బాస్. ఈ క్రమంలో మంగళవారం షో నాటిక, ఫ‌న్నీ టాస్క్‌ల‌ను ఇచ్చాడు. కానీ అంత‌లోనే కెప్టెన్ కోసం టాస్క్ పెట్టి మళ్ళీ కంటెస్టెంట్ల మధ్య అగ్గి రాజేశాడు.


తొలుత ఇంటి స‌భ్యుల‌ను ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి లోబోతో శ్వేతా వర్మ పెళ్లి చూపులు అని చిన్న స్కిట్ చేయించారు. ఇందులో అందరూ కలిసి లోబోను బకరా చేశారు. అందరూ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తే విధంగా యాక్టింగ్ చేశారు. ఈ స్కిట్ త‌రువాత‌.. ఎప్పటిలాగే షన్ను గ్యాంగ్ ఉప్ప‌ర్ మీటింగ్ పెట్టుకుంది. నామినేషన్స్ గురించి సమావేశమయ్యారు. వారిని నామినేట్ చేసిన వాళ్లపై కారాలు మిరియాలు నూరుతూ కనిపించారు. దీంతో మంగళవారం కూడా అదే వేడి కనిపించింది.

ఇంత‌లోనే బిగ్ బాస్ మరో టాస్క్ పెట్టాడు. బీబీ బొమ్మల ఫ్యాక్టరీ.. అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్లో భాగంగా కంటెస్టెంట్ల‌ను బ్లూ, ఎల్లో, రెడ్, గ్రీన్ టీమ్‌లుగా విభ‌జించారు. బ్లూ టీమ్‏లో మానస్, సన్నీ, యానీ మాస్టర్ ఉండగా.. ఎల్లో టీమ్ లో షణ్ముఖ్, ప్రియాంక, జెస్సీలు, అలాగే రెడ్ టీమ్ లో విశ్వ, శ్రీరామ్, ప్రియలు.. గ్రీన్ టీమ్ లో రవి, లోబో, శ్వేత లు ఉన్నారు. ఇక మిగిలిన సిరి, కాజల్ ల‌ను సంచాలకులుగా నియ‌మించారు బిగ్ బాస్‌. రెడ్, గ్రీన్ టీంల‌కు మేనేజర్స్ గా సిరిని.. బ్లూ.. ఎల్లో టీమ్స్ కి కాజల్ ను మేనేజర్ గా వ్య‌వ‌హ‌రించారు.

సిరి, కాజ‌ల్లే బొమ్మలను తనిఖీ చేస్తారు. కెప్టెన్సీ పోటీ దారులు అవ్వాలంటే.. ప్రతి టీమ్‌ ప్రత్యర్థుల కంటే ఎక్కువ బొమ్మలు తయారు చేయాల్సి ఉంటుంది. గెలిచిన టీంకి మేనేజర్‌గా ఉన్నవాళ్లకి కూడా కెప్టెన్ అయ్యే అవకాశం ఇచ్చాడు. ఇక్క‌డే అస‌లూ ర‌చ్చ మొద‌లైంది. ఈ టాస్క్‌లో భాగంగా యానీ మాస్టర్‌, సిరిల మధ్య మాటల యుద్దం జరిగింది. దీంతో యానీ మాస్ట‌ర్ త‌న విశ్వ‌రూపాన్ని చూపించింది.

సంచాలకులుగా ఉన్నవారు బొమ్మల కౌంటింగ్ సరిగా చేయాలని.. బజర్ మోగిన తర్వాత బొమ్మలను తెస్తే నేను ఒప్పుకోనని యానీ మాస్టర్ అన్న‌ది. దీంతో రియాక్ట్ అయ్యినా.. మాకెవరూ ఏం చెప్పొద్దూ.. సంచాలకురాలిగా మేం చూసుకుంటాం.. అంటూ సిరి వాదించింది. నేను రూడ్ కాదు.. నాకు దొంగాట‌లు రావు.. నేను డ్రామా క్వీన్ కాదు అంటూ మండిపడింది.

ఇకపై అలానే ఆడతాను.. ఇప్పుడు నా చేతుల్లో గేమ్ ఉంది.. నేను ఆడతాను అని సిరి ఫైర్ అయ్యింది. లాస్ట్‌ టాస్క్‌లో ఫ్రెండ్‌ని కోల్పోయా.. ఈ టాస్క్‌లో బిడ్డని కోల్పోయా.. అలాంటి తొక్కల రిలేషన్‌షిప్‌ నాకొద్దంటూ యానీ మాస్టర్‌ తన అసలు రూపాన్ని బయటపెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news