ఏపీలో మహిళా వాలంటీర్ అనుమానాస్పద మృతి..!

ఏపీలోని విజయవాడ కృష్ణలంక బాలాజీ నగర్ లో ఓ మహిళా వాలంటీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వాలంటీర్ భవానీ శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే…. బాధితురాలు పదకొండేళ్ల కిందట ప్రభాకర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే భర్త, అత్తమామలు ఆడపడుచుల వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.crime

పెళ్లి చేసుకున్న నాటి నుండి భర్త వేధింపులు మొదలయ్యాయని చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో చేరుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే వాలంటీర్ భవాని 76 వ నెంబర్ వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నారు తెలుస్తోంది. భవాని అత్తమామలను, భర్తను కఠినంగా శిక్షించాలని ఆమె తల్లి దండ్రులు డిమాండ్ చేస్తున్నారు.