Bigg Boss 5 Telugu: లోబో కు బైబై చెప్పిన బిగ్ బాస్..!

-

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 బుల్లితెర ప్రేక్ష‌కులను అమితంగా ఆక‌ట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో.. గొడవలు, ఏడుపులు, అరుపులతో రచ్చ చేస్తున్నారు కంటెస్టెంట్స్. ఒకరికి ఒకరికి ఎక్కడా తగ్గాబోము అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకరిపై ఒకరు అరుస్తూ.. ఏడుస్తూ.. ఇంట్లో నానా హంగామా సృష్టించారు.

అంత బాగున్న‌… ఈ సీజ‌న్‌లో ఎలిమినేష‌న్ ఎపిసోడ్ లో ప‌స లేకుండా పోతోందనే చెప్పాలి. ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నే ఉత్కంఠ లేకుండా పోతుంది. ఒక‌రోజు ముందే లీక‌వ‌డంతో స‌స్పెన్స్ ఉండ‌టం లేదు. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది ఆరుగురు. రవి, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్, సిరి, లోబో ఈ ఆరుగురు నామినేషన్స్‌లో ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నదానిపై ప్రేక్షకులకు స్పష్ఠమైన అభిప్రాయం ఉంది.

వీరిలో ర‌వి, శ్రీరామ్, మాన‌స్‌, ష‌ణ్ముఖ్‌ల‌కు ఓటింగ్ ప‌రంగా ఢోకా లేదు. వీళ్లంద‌రికీ సోష‌ల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది, వీరు టాప్ 5 కంటెస్టెంట్స్ రేస్‌లో ఉన్నారు. కాబ‌ట్టి ఈజీగా ఎలిమినేష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. ఎటొచ్చీ సిరి, లోబోల‌నే ఎలిమినేష‌న్ గండం వెంటాడుతోంది. వీళ్లిద్ద‌రిలో లోబో క‌న్నా సిరి బెట‌ర్ అన్న‌ది చాలామంది అభిప్రాయం. మిగిలింది లోబోనే కావడంతో ఇతను ఎలిమినేట్ కావడం పక్కా అని.. ఇటు లీకు వీరులు , అటు పోల్స్ కూడా ఇదే చెబుతున్నాయి.

బిగ్ బాస్.. లోబోని సీక్రెట్ రూంకి పంపి మంచి అవ‌కాశమిచ్చారు. కానీ ఆ అవ‌కాశాన్ని ఏ మాత్రం ఉప‌యోగించుకోలేదు. గ‌త సీజ‌న్లో సీక్రెట్ రూంకి వెళ్లిన వాళ్లు టాప్ 5 కంటెస్టెంట్లో నిలిచారు. మొన్న‌టి సీజ‌న్లో అఖిల్ సీక్రెట్ రూంకి వెళ్లి .. ర‌న్న‌ర్ అయ్యారు. అంతకు ముందు రాహుల్ సిప్లింగంజ్ విన్నర్ అయ్యాడు. ఈ లెక్కన చూసుకుంటే.. సీక్రెట్ రూం అంటే బిగ్ బాస్ హౌస్‌లో చాలా ప్రాధాన్యత ఉంది.. కానీ లోబోని పంపడం ద్వారా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు.

అయితే సీక్రెట్ రూంకి పంపిన కంటెస్టెంట్‌ని అంత ఈజీగా ఎలిమినేట్ చేస్తారా? ఈవారం.. దీపావళి ఆఫర్‌లో భాగంగా లోబోని ఎలిమినేష‌న్ నుంచి సేవ్ చేస్తారా? అలాగే.. లోబో ను ఆనీ మాస్ట‌ర్ త‌న ప‌వ‌ర్ తో ఎలిమినేషన్ నుంచి సేవ్ చేస్తుందా అనే అనే అభిప్రాయాలు వెల్లువ‌తున్నాయి. అనీ మాస్ట‌ర్ త‌న సూప‌ర్ ప‌వ‌ర్ తో త‌న‌ని తాను సేవ్ చేసుకుంటుంది త‌ప్పా.. ఎదుటి వాళ్ల‌ను సేవ్ చేసే అంతా లేద‌నే చెప్పాలి. దీపావ‌ళి ఆఫ‌ర్ భాగంగా నామినేషన్స్ క్యాన్సిల్ చేస్తే త‌ప్పా.. సేవ్ అవ్వ‌డం క‌ష్ట‌మేన‌ని చెప్పాలి. నో ఎలిమినేష‌న్ ఉంటుందో..? లేదా లోబో బ్యాగ్ స‌ర్దేసి.. బ‌స్తీకి వెళ్లిపోతాడో తెలుసుకోవాలంటే.. ఈ రోజు ఎపిసోడ్ వ‌ర‌కు వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news