Bigg Boss 5: అది పాల్త్ గేమ్ ఆడుతోంది.. కంటెస్టెంట్ల బండారం బ‌య‌ట‌పెట్టిన భాగ్యం

Bigg Boss 5: బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5 ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి ఎంట‌ర్ అయ్యింది. రెండో వారం ఎలిమినేష‌న్ మాత్రం.. అందరూ భావించినట్లే.. న‌టి ఉమాదేవి బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. దీంతో లోబో, ఉమాదేవిల మ‌ధ్య సాగిన‌ రొమాన్స్ ట్రాక్ కి బ్రేక్ ప‌డిన‌ట్టు అయ్యింది. ఉమాదేవీ ఎలిమినేషన్ కి ఆమె హౌస్ లో బూతుల వర్షం కురిపించ‌డ‌మే.. కార‌ణ‌మ‌ని తెలుస్తుంది.

ఎలినేష‌న్ అనంత‌రం అరియానాతో జరిగిన బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ లో ఏమాత్రం దాచుకోకుండా చెప్పేసింది ఉమాదేవి. తన‌లా తాను ఆడింటే.. గేమ్ ఇంకో విధంగా ఉండేద‌ని అన్నారు. ఎవ‌రు ఎలా ఆడుతున్నారో? వాళ్లు ఎలా ప్రవర్తిస్తున్నారో వివరిస్తూ సంచలన ఆరోపణలు చేసింది ఉమా.
ఒక్కో ఇంటి స‌భ్యుడిని తనదైన శైలిలో క‌డిగి పారేసింది. ఆమె మాట‌లు విని కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియెన్స్ కూడా షాక‌య్యారు. తన‌లాగ తాను ఆడి ఉంటే.. ఎక్కడో ఉండేదాన్ని అన్న‌ది. బంగాళాదుంప క‌ర్రీ గురించి ప్ర‌స్తవించింది. ఆస‌లు ఆ కూరే ఎలిమినేషన్ కారణం కాద‌ని చెప్పింది. హౌస్‌లో సొల్లు కబుర్లు చెప్పడం తప్ప .. ఏ కంటెస్టెంట్ కూడా పనీ చేయడం లేదనీ ఘాటుగా విమ‌ర్శించింది.

తొలుత సిరి, ష‌ణ్ముఖ్ ల‌ను టార్గెట్ చేసింది. వాళ్లిద్ద‌రూ బ‌య‌ట‌నే గేమ్ సెట్ చేసుకుని వ‌చ్చార‌నీ.. హౌస్‌లో డబుల్ గేమ్ ఆడుతున్నార‌నీ, వాళ్లు ప్ర‌తి టాస్క్‌లలోనూ ఎలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారని క‌డిగేసింది ఉమా. బ‌య‌ట‌కు మాత్రం.. షణ్ముఖ్‌కి తనకి పడదని, వారికి పరిచయం లేదని సిరి చెపుతుంద‌ని అన్నారు. కెప్టెన్ టాస్క్‌లో సిరి స‌పోర్ట్ చేస్తూనే.. ఇన్ డైరెక్ట్‌గా.. తాను సపోర్ట్ చేస్తూనే చేయలేదని ష‌ణ్ముఖ్ మిగిలిన ఇంటి సభ్యులకు చెప్పారు.

అసలు సిరి.. షణ్ముఖ్ కు ఫ్రెండ్స్ ఏంటి?? ఫ్రెండ్ షిప్‌ కోసమే బిగ్ బాస్‌కి వచ్చారా? అలా ఆడుకునేది ఉంటే.. ఇంట్లో వెళ్లి ఆడుకోవచ్చు కదా.. నేను ఉన్న‌ది ఉన్న‌ట్టు.. ఇట్లా మాట్లాడితే తప్పు అవుతుంది.
అస‌లు మంచాలు కూడా పక్క పక్కనే వేసుకుంటారా?? దాని పక్కనే వాడు మంచం వేసుకోవాలా?? బయటకు వచ్చిన తరువాత కూడా వాళ్లిద్దరి అలానే ఉంటారా? షో త‌రువాత‌.. దాని పనులు దానివి.. వాడి పనులు వాడివి.. సిరిది.. మామూలు హుషారు కాదు.. ఇలా చేస్తే.. అన్ని రోజు వర్కౌట్ కాదు బిడ్డా.. అంటూ సిరి, షణ్ముఖ్‌లను గురించి ప‌చ్చిగా మాట్లాడింది ఉమాదేవి.

అనంత‌రం ప్రియ, ఆనీ, రవిలను టార్గెట్ చేసింది. ఆనీ మాస్ట‌ర్ గురించి మాట్లాడుతూ.. ఆనీ మాస్టర్ మెంటాలిటీ చాలా కన్నింగ్.. ఫాల్తు గేమ్ ఆడేది మాత్రం ఆదే. యాంక‌ర్ ర‌విపై కూడా త‌న‌దైనా శైలిలో
రెచ్చిపోయింది. అస‌లు యాంకర్ రవిని గట్టిగా గొడవపడాలని చాలా సార్లు అనుకున్నా..కానీ, ఛాన్స్ ఇవ్వలేదని అన్నది. ప్రియ.. బిగ్ బాస్‌లో వేస్టని.. ఆమె పనికిరాదని రెచ్చిపోయింది. లొబోను ఇంటిలోని ఇత‌ర స‌భ్యులు త‌క్కువ‌గా చూస్తున్నారనీ, ఎలా చూస్తున్నారో త‌న‌కు తెలుసున‌నీ, లోబో త‌న‌కు మంచి స్నేహితుడని. త‌మ‌ గురించి వేరే వాళ్లు ఏమైనా అనుకోని తాను బాధ‌ప‌డననీ తేల్చి చెప్పేసింది. ఇప్పుడూ ఈ ఇంట‌ర్యూకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతుంది.