బిగ్ బాస్ 6: రేవంత్ ను టార్గెట్ చేసిన గీతూ రాయల్.. వెళ్ళిపోతే బాగుండు అంటూ..!!

-

ప్రముఖ సింగర్ రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈయన మంచి చేయాలనుకున్నా.. చెడుగా కన్వే అవుతుంది. అంతేకాదు తన వాయిస్ తనకు మైనస్ అని తెలుస్తోంది.. రేవంత్ కు హౌస్ మేట్స్ అందరూ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని చెప్పవచ్చు. వారిలో ముఖ్యంగా గీతూ రాయల్ రేవంత్ ను టార్గెట్ చేస్తూ మరింతగా రెచ్చిపోతుంది. ఇకపోతే గీతూ రాయల్ మొదటి నుంచి చాలా ఓవర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక చంటితో మాట్లాడాలి అని ఆయన చేసిన పనులకు ఇక్కడే క్లారిటీ తీసుకోవాలని నామినేషన్ అప్పుడు గోల చేసింది. అంతేకాదు చంటి లోనీ తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేసింది. ఇక అప్పటికే అలసిపోయిన హౌస్ మేట్స్ లివింగ్ రూమ్ లో కూర్చుని పరిష్కరించుకుందాం అంటూ రిక్వెస్ట్ చేయడంతో గీతూ రాయల్, చంటి కూడా వెళ్లిపోయారు.

గీతూ, చంటి విషయంలో తన ప్రస్టేషన్ అంతా బయటకు పెట్టింది. ఇక చంటి మాత్రం చాలా కూల్ గా గీతూకి ఎక్స్ప్లైన్ చేసే ప్రయత్నం చేశాడు.. ఇక చివరికి నువ్వు మైండ్లో ఒకటి ఫిక్స్ అయితే ఎవరు చెప్పినా వినవు అంటూ కంక్లూషన్ ఇచ్చాడు . ఆ తర్వాత గీతూ రేవంత్ బిహేవియర్ గురించి ఆదిరెడ్డి ఇంకా అర్జున్ లతో డిస్కస్ చేసింది . ఆయన బిహేవియర్ మారాలి అని ,ఇలాగే ఉంటే హౌస్ నుంచి పోతాడు అంటూ జోష్యం కూడా చెప్పింది.. అంతేకాదు ఆమె మరింతగా రెచ్చిపోతూ జనాలకు ఇదేం ఆటిట్యూడ్ రా బాబు అన్నట్లుగా ఉంటుందని బయట ప్రేక్షకులు ఏమనుకుంటారో తెలిసిన దానిలా ముందే చెప్పేసింది. రేవంత్ బయటకు వెళ్ళిపోతేనే .. ఆయన కెరీర్ బాగుంటుంది అన్నట్లుగా కూడా చెప్పింది..

దీనికి తోడు ఆదిరెడ్డి కూడా నిజమే అంటూ గీతూకి వత్తాసు పలికాడు. ఇకపోతే అర్జున్ కచ్చితంగా ఈ విషయాన్ని రేవంత్ కి చెప్తాడని తెలిసే వీళ్ళు మాట్లాడారా లేదా వాళ్ళ గేమ్ స్ట్రాటజీని చూడాలని ఇలా చేశారా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంపై నాగార్జున ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. నిజానికి మొదటి వారం నామినేషన్ లో గీతూ లేదు. కానీ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news