బిగ్ బాస్ 6: మొదలైన మొగుడు- పెళ్ళాల కొట్లాట.. ఎంతవరకు దారితీస్తుందో..?

-

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో మొదటిసారి భార్యాభర్తలకు ఎంట్రీ దొరికిందని చెప్పవచ్చు. అలా హీరో వరుణ్ సందేశ్ ఆయన భార్య ప్రముఖ యూట్యూబర్ వితికా షేర్ కూడా హౌస్ లోకి జంటగా ప్రవేశించారు. మిగతా వాళ్లకంటే వీరిద్దరే తరచుగా గొడవపడేవారు. ఇక మూడవ సీజన్ తర్వాత మరల కపుల్ ఆర్టిస్టులు రోహిత్, మెరీనా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. రెండో రోజే ఈ జంట గొడవ మొదలుపెట్టారు. ఇక వాష్రూమ్ దగ్గర మెరీనా ఆమె భర్త రోహిత్ కి గీతూ గురించి ఏదో చెప్పబోయింది. ఆ సమయంలో రోహిత్ అద్దంలో తన బాడీని చూసుకుంటా ఉండడంతో అది చూసిన మెరీనాకు నచ్చలేదు.

మెరీనా కోపంతో నువ్వు ముందు నీ బాడీ అయినా చూసుకో.. లేదంటే నేను చెప్పేదైనా విను అని విసుక్కుంది. అప్పుడు రోహిత్.. ఓకే ఇప్పుడు చెప్పు అని అన్నాడు. కానీ అప్పటికే కోపం తెచ్చుకున్న మెరీనా నేను చెప్పనంటుంది. ఇక అందుకు రోహిత్ ఓవరాక్షన్ చేయకంటూ విసుక్కున్నాడు. ఓవరాక్షన్ కాదు అని మెరీనా అనడంతో ఓవరాక్షన్ కాకపోతే వెళ్ళిపో మరి అని రోహిత్ చెప్పడం ఆమె వెళ్లిపోవడం జరిగిపోయాయి. ఇక ఏం పరిస్థితి తీసుకొచ్చావు స్వామి బిగ్ బాసా అంటూ వీడియో వదలడం జరిగింది. ఇక అలా ఇద్దరి మధ్య చిన్న మనస్పర్ధలు ఏర్పడ్డాయి . ఇక హౌస్ లోకి వచ్చిన రెండవ రోజు వీరిద్దరూ గొడవపడడం కొంచెం ఆసక్తికరంగా మారినా.. రానున్న రోజుల్లో ఈ జంట ఎలా కొనసాగుతుందో అని ఆసక్తి కూడా మొదలైంది.

ఇకపోతే చక్కని సంసారంలో బిగ్ బాస్ నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ పలువురు ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ నిర్వాహకులు షోపై బజ్ పెంచడానికి ఇలా ఎడిటింగ్లో క్రియేట్ చేసి చూపిస్తుంటారు అంటూ పలు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. ఏది ఏమైనా మెరీనా, రోహిత్ చూడ చక్కని జంట. కానీ బిగ్ బాస్ లో గొడవ పడడం నచ్చలేదు అంటూ వారి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news