బిగ్ బాస్ 6: ఓటింగ్స్ లో హవా తగ్గించుకున్న రేవంత్.. టాప్ లో వీళ్లే..!!

-

బిగ్ బాస్ షో గత రెండు వారాలుగా నీరసంగా కొనసాగింది. ఇకపోతే ఎప్పుడైతే నాగార్జున కంటెస్టెంట్లను.. కాలక్షేపం చేయడానికి వచ్చారా అంటూ విరుచుకుపడ్డారో అప్పట్నుంచి మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇంతకుముందు ప్రతిసారి ఏదో సరదాగా నవ్వుకుంటూ వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇక రెండోవారం చివరి నామినేషన్ తర్వాత మూడో వారం ఓటింగ్ కూడా భారీ స్థాయిలో మారిపోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు ఎక్కువ స్థాయిలో ఓట్లు అందుకున్నారు అనే విషయం ఇప్పుడు చూద్దాం..

ఇక మూడవ వారం నామినేషన్ లో ఎవరెవరు ఉన్నారు అని వివరాల్లోకి వెళ్తే ఆదిత్య , ఆరోహి ఇద్దరూ కూడా నామినేషన్స్ లో నిలిచారు. ఇక తర్వాత నేహా, ఇనయ , సుదీప మొత్తంగా 10 మంది కంటెస్టెంట్స్ ఇప్పుడు నామినేషన్ లో ఉన్నారు. అయితే వీరిలో డేంజర్ జోన్ లో ఉన్నది సుదీప మాత్రమే అని తెలుస్తోంది. గీతూ రాయల్ అందరికంటే ఎక్కువ స్థాయిలో ఓట్లు అందుకున్నట్లు సమాచారం ఇక ఆమెపై సోషల్ మీడియాలో ఒక నెగటివ్ కామెంట్ ఊహించని స్థాయిలో పెరుగుతున్నప్పటికీ ఓట్లు మాత్రం గట్టిగానే పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత వాసంతి అత్యధిక ఓట్లు అందుకునీ రెండవ స్థానంలో ఉంది.

ఇక రేవంత్ కు ఈసారి చాలా వరకు ఓట్లు తగ్గినట్లు తెలుస్తోంది . ఎందుకంటే రెండో వారంలో అనవసరపు వివాదాల కారణంగా సోషల్ మీడియాలో అతనిపై నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఆరోహి ఐదవ స్థానంలో కొనసాగుతోంది అయితే ఈ వారం అతి తక్కువగా ఓట్లు అందుకున్న వారిలో సుదీప ఉండడం విశేషం.. ఇక ఏడవ స్థానంలో శ్రీహన్, చంటి కొనసాగుతున్నారు. ఈవారం ఎలిమినేషన్ లో సుదీప ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news