బిగ్ బాస్ 6: రేవంత్ కి షాక్ .. ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్..!

-

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఈవారం ముగియబోతున్న విషయం తెలిసిందే. గ్రాండ్ ఫినాలే వారం జరగబోతున్న నేపథ్యంలో ఇందులో 6 మంది కంటెస్టెంట్లు ఫైనల్ లో పోటీ పడుతున్నారని తెలిసింది. కానీ మిడిల్ వీక్ ఎలిమినేషన్స్ లో భాగంగా ఫైనల్ కి 5 మందిని పంపించి.. ఈరోజు రాత్రికి ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయని నాగార్జున స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గత రెండు రోజుల ద్వారా వచ్చిన ఓటింగ్స్ ను పరిగణలోకి తీసుకొని ఎవరు లిస్టులో ఉంటారో వారు ఎలిమినేట్ అవ్వక తప్పదు అని హిస్ట్ నాగార్జున స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే అందులో ఒకరు ఈరోజు రాత్రి వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళల్లో కూడా ఒకరు మాత్రమే విజేతగా నిలవబోతున్నారు.

దీంతో ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్ ని గెలిపించడానికి ఫుల్లుగా ఓట్లు గుద్దేస్తున్నారని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సీజన్లో మొదటిసారి భారీ ఓటింగ్ నమోదు అవుతుందని కూడా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఫినాలే వీక్ లో కూడా రేవంత్ ముందంజలో ఉన్నాడు. అయితే ఈ వారం ఆరంభంలో 30% ఓట్లు మాత్రమే వచ్చాయి అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఓట్లు క్రమంగా తగ్గుతున్నాయి అని కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికీ కూడా సింగర్ రేవంత్ మొదటి స్థానంలోనే ఉండగా.. రెండవ స్థానంలో శ్రీహన్.. మూడవ స్థానంలో రోహిత్ ఉన్నారు.

నాలుగవ స్థానంలో కీర్తి.. ఐదవ స్థానంలో ఆదిరెడ్డి.. ఆరవ స్థానంలో శ్రీ సత్య కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే ఈరోజు సాయంత్రం కళ్ళ ఈ స్థానాలు మారే అవకాశాలు ఉన్నాయని కూడా సమాచారం. అంటే ఈ ఇద్దరిలో ఒకరు మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నా.. మరి కొంత మంది కీర్తీ భట్ ను పంపించే అవకాశం ఉన్నట్లు స్పష్టమైనది మొత్తానికైతే ఈ ముగ్గురిలో ఒకరు ఈరోజు ఎలిమినేట్ కాబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news