Bangladesh vs India : నేటి నుంచే బంగ్లాదేశ్ మరియు టీమ్ ఇండియా మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ లోని చట్ గ్రామ్ వేదికగా ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మకు గాయం కావడంతో కేఎల్ రాహుల్ ఈ టెస్ట్ మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అటు వన్డే సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్ పూర్తి ఉత్సాహంతో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతోంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే,
బంగ్లాదేశ్ : మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్ (c), లిటన్ దాస్, నూరుల్ హసన్ (wk), మెహిదీ హసన్ మిరాజ్, ఎబాడోత్ హుస్సేన్, ఖలీద్ అహ్మద్, తైజుల్ ఇస్లాం
ఇండియా: శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ (సి), ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్