తెలుగు రాష్ట్రాలలో ఒక్కొక్కరిపై సగటున 60 వేల అప్పు

-

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఊహించని షాక్ తగిలింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తలసరి అప్పు రూ. 60 వేలు గా ఉందని కేంద్రం కీలక ప్రకటన చేసింది. 2020 మార్చినాటికి తెలంగాణ ప్రభుత్వం అప్పు రూ. 2,25,418 కోట్లుగా కోట్లుగా ఉందని కేంద్రం పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు రూ.3,07,672 కోట్లు గా ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

తెలంగాణ తలసరి రుణ భారం రూ. 64, 398గా ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అటు ఏపీ తలసరి రుణభారం రూ. 62,059 గా ఉన్నట్లు వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తలసరి రుణభారాన్ని లెక్కించినట్లు కేంద్రం పేర్కొంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయ వనరులు సరిగా లేకపోవడంతో ఆ రాష్ట్రం అప్పుల పాలు అవుతోంది. సరైన సమయానికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news