బిగ్ బాస్: కెప్టెన్ గా సిరి.. సీజన్ మొత్తం వరకు కెప్టెన్ అర్హతను కోల్పోయిన సీనియర్ యాక్టర్

బిగ్ బాస్ లో ఐదవ రోజు ఆట ఆసక్తిగా సాగింది. 19మంది కంటెస్టెంట్లు ఉన్న బిగ్ బాస్ ఇల్లు కంగాళీగా అనిపిస్తున్నప్పటికీ కంటెంట్ క్రియేట్ చేయడంలో వారంతా ఒక అడుగు ముందే వేస్తున్నారు. బిగ్ బాస్ లో ప్రేమాయణం ఇప్పుడిప్పుడే మొదలవుతున్నట్లు తెలుస్తుంది. లోబో, ప్రియ మధ్య జరిగిన చిన్న ఫన్నీ సంభాషణ అలా అనిపించినప్పటికీ అదంతా హాస్యం కోసమే చేస్తున్నట్లు అర్థమైంది. మరో పక్క సీరియస్ నెస్ కూడా పెరుగుతుంది. బిగ్ బాస్ ఇచ్చిన పవర్ కారణంగా సీనియర్ యాక్టర్ ప్రియ కెప్టెన్ గా అర్హతను కోల్పోయింది.

ఇక బిగ్ బాస్ సీజన్ 5లో ఎప్పటికీ కెప్టెన్ కాకుండా హమీదా తనకున్న శక్తిని ఉపయోగించింది. అనంతరం, పవర్ రూమ్ కి వెళ్ళిన వారందరూ కెప్టెన్సీ టాస్కుకు అర్హత సాధించారు. వారందరిలో సిరి గెలిచింది. ఆడవాళ్లే గెలవాలన్న కాంక్షతో కాజల్ చేసిన పని సరయుకి కోపాన్ని తెప్పించింది. కాజల్, సరయు మధ్య మాటల యుద్ధానికి దారి తీసినప్పటికీ, సరయు అన్న ఒక్క మాటతో అక్కడికే ఆగిపోయింది.

ఆ తర్వాత ఏ డిపార్ట్ మెంట్లో ఎవరు పనిచేయాలన్న డిస్కషన్ మొదలైంది. సీనియర్ యాక్టర్ ఉమాదేవి గారు ఇక్కడ కంటెంట్లోకి వచ్చారు. నాన్ వెజ్ తినను, వండిన సామాన్లను కడగను అన్న ఉమాదేవి గారితో లహరి గొడవకు దిగింది. మిమ్మల్ని ఎవరు వండమన్నారు అంటూ ఫైర్ అయ్యింది. ఒక్క లహరినే కాదు హౌస్ మేట్స్ లో చాలామంది ఉమాదేవి గారిని వ్యతిరేకించారు. మరి ఈ వ్యతిరేకత ఉమాదేవిని ఎక్కడివరకు తీసుకెళ్తుందో చూడాలి.