ఎంపీ కోమటిరెడ్డికి కరోనా పాజిటివ్

తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువే ఉన్నా జనాన్ని మాత్రం టెన్షన్ పెడుతూనే ఉన్నాయి. ఈ కేసులు సామన్యులనే కాక సినీ, రాజకీయ ప్రముఖుల్ని కూడా టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే ఈ కరోనా తెలంగాణాలో చాలా మంది రాజకీయ నేతలకు సోకగా దీని ఎఫెక్ట్ తో నాయిని లాంటి నేతలు కన్ను మూశారు కూడా.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణాలోని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే కొద్ది రోజులుగా ఆయన దుబ్బాక ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. దీంతో ఆయనతో కాంటాక్ట్ లో ఉన్న నేతలు అందరిలో టెన్షన్ నెలకొంది. ఆయనకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అయన హోం ఐసోలేషన్ కి వెళ్లినట్టు సమాచారం. ఇక ఈ అంశం మీద మరింత సమాచారం అందాల్సి ఉంది.