బిగ్ బాస్: మెహబూబ్ సేఫ్.. ఆమె ఔట్..?

-

బిగ్ బాస్ మూడవ వారం ఎలిమినేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో హౌస్ నుండి బయటకు వెళ్లేందుకు చాలా మంది పోటీపడుతున్నారు. దానికి కారణం బిగ్ బాస్ ఇచ్చిన టాస్కే. షోని మరింత రక్తి కట్టించడానికి బిగ్ బాస్ యాజమాన్యం చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది. ఈ వారం ఆ ప్రయత్నం సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు. ఒకపక్క ఐపీఎల్ జరుగుతున్నా కూడా బిగ్ బాస్ షోకి రికార్డు రేటింగ్స్ వస్తున్నాయి.

 

ఐతే ఈ వారం ఎలిమినేషన్ పై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో పాపులర్ అయిన మెహబూబ్, హౌస్ లో నుండి బయటకు వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం దేవి నాగవల్లి హౌస్ నుండి బయటకు వెళ్ళనుందని అంటున్నారు. మొదటి నుండి దేవి నాగవల్లిపై సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకత నడుస్తుంది. ఎప్పుడెప్పుడు నామినేషన్స్ లోకి వస్తుందా అని ఎదురుచూసిన వారున్నారు.

ప్రస్తుతం దేవి నామినేషన్స్ లో ఉంది. అందువల్ల దేవి హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుందని అనుకుంటున్నారు. ఐతే దేవికి కొంత మేర సపోర్ట్ దొరుకుతున్నప్పటికీ వ్యతిరేకత కారణంగా ఎలిమినేషన్లో మొదటి స్థానానికి వచ్చేసిందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news