బిగ్ బాస్: ఊహించని విధంగా రాజశేఖర్ అవుట్.. ఏం జరిగిందంటే..?

-

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 కొనసాగుతున్న నేపథ్యంలో నాలుగవ వారం కొనసాగుతోంది. ఈసారి నాలుగవ వారంలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే విషయానికి వస్తే ఊహించిన విధంగా మోడల్ రాజశేఖర్ ఎలిమినేట్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే.. నిజానికి నామినేషన్ లో డేంజర్ జోన్ లో ఉన్న రాజశేఖర్, సూర్య, ఆరోహి, అర్జున్, సుదీప వంటి వారు హోటల్ టాస్క్ లో మంచి పర్ఫామెన్స్ ఇవ్వలేదు అని డేంజర్ జోన్ లో ఉంచారు. కానీ ఈ టాస్క్ లో సుదీప తన వంతు ప్రయత్నం గా మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వడంతో ఓటింగ్ కూడా ఈమెకు పెరిగింది. దాంతో ఎలిమినేషన్ నుంచి ఆమె సేఫ్ అయింది అని చెప్పవచ్చు. కానీ ఊహించని విధంగా రాజశేఖర్ వెనుకబడిపోయాడు.

ప్రతిసారి బిగ్ బాస్ టీం ప్రతి ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియను నిర్వహిస్తుంది.కానీ ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా రాజశేఖర్ ని ఎలిమినేట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో కొంతమంది తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.. ఇకపోతే మొదటి వారం ఎలిమినేషన్ లేకుండా చేసిన బిగ్ బాస్ , రెండవ వారంలో డబుల్ ఎలిమినేషన్ నిర్వహించారు. 3 వ వారం కంటెస్టెంట్ నేహాను బయటకు పంపించి ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు బిగ్ బాస్. ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ జరగాలి. అప్పుడు డబుల్ ఎలిమినేషన్ చేయవచ్చు. కానీ ఈసారి ఈ ఎలిమినేషన్ కొంచెం ఆశ్చర్యకరంగా ఉండబోతుందని సమాచారం.

ఊహించని విధంగా బిగ్ బాస్ మూడో వారం కెప్టెన్గా రాజశేఖర్ బాధ్యతలు చేపట్టాడు. కానీ కెప్టెన్ గా ఉన్నప్పుడే ఆరోహితో వివాదానికి దిగాడు. ఆ తర్వాత హోటల్ టాస్క్ లో కూడా పెర్ఫార్మెన్స్ అసలు ఇవ్వలేదు. దీంతో ఓటింగ్ తగ్గిపోయింది . ఈ ప్రకారమే రాజశేఖర్ ను ఎలిమినేట్ చేశారా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు శనివారం వచ్చే ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అయ్యారో చూస్తే తప్ప చెప్పలేము.

Read more RELATED
Recommended to you

Latest news