Bigg Boss: లోబోకు దిమ్మ‌తిరిగే ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఎలిమినేష‌న్.. అంత‌లోనే..!

-

Bigg Boss: బిగ్‌బాస్5 తెలుగు షోలో అనూహ్యమైన పరిణామం చోటుచేసుకొన్నది. ఎవ‌రూ ఊహించ‌ని ట్విస్ట్‌ల‌కు బిగ్ బాస్ వేదిక అయ్యింది. మునుపు ఎన్నాడు లేని విధంగా అటు ప్రేక్ష‌కుల‌కు , ఇటు ఇంటి స‌భ్యుల‌కు షాకిచ్చారు. బిగ్ బాస్ షో చాలా చ‌ప్ప‌గా సాగుతుంద‌నే రూమ‌ర్స్ కు పుల్ స్టాప్ పెట్టింది నిన్న‌టి ఎపిసోడ్. అలాగే.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌కు తెర లేపారు. ఇలాంటి ట్విస్టుల‌తో చాలా ఉత్కంఠ‌గా జ‌రిగింది. ఆ దిమ్మ తిరిగే ట్విస్ట్ ఏమిటి? హౌస్‌లోని స‌భ్యులు చెమ‌ట‌లు క‌క్క‌డానికి కార‌ణ‌మేమిటి? ఇంకా ఏం జరిగిందంటే..


నిన్న‌టి ( శ‌నివారం) వికెండ్ షోలో చాలా గ‌రంగ‌రంగా క‌నిపించాడు కింగ్ నాగ్. త‌ప్పు చేశారంటూ నిల‌దీసాడు. ఈ క్ర‌మంలో తొలుత లోబో కు చుక్క‌లు చూపించాడు. ర‌వి ఏం చెబితే అది చేస్తావా? నీ గేమ్ నువ్ ఆడుకో .. అని గ‌తంలోనూ నాగ్ చెప్పారు. కానీ.. లోబో తీరులో ఎలాంటి మార్పు రాలేదు. చివరకు రవి చెప్పాడని.. హౌస్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశాడు. దీంతో నిన్నటి ఎపిసోడ్ లో లోబోకు ఓ రేంజ్ లో జలక్ ఇచ్చాడు నాగార్జున.

చేతిలో టెడ్డీ పెట్టి.. మాట‌ల తూటాలు పేల్చుతూ.. నిల్చున్న చోటే.. చెమ‌ట‌లు పట్టించారు. త‌న‌దైన మాస్ స్టైల్ లో క్లాస్ తీసుకున్నారు. ఆ త‌రువాత‌.. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఒక్కొ కంటెస్టెంట్ ను సిక్రెట్ రూంకు పిలిచి ఇంట్లో ఉండడానికి అర్హత లేని వారు ఎవరో చెప్పాలని అడిగాడు బిగ్ బాస్.
దీంతో ఒక్క‌రి నిజ స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డింది. ఎవ‌రు ఎవ‌రిని ద్వేషిస్తున్నార‌నే తెలిసి పోయింది.

ఎవ‌రు ఎవ‌రి పేరు చెప్పారంటే..
జెస్సీ.. యాంకర్ రవి.
మానస్.. శ్రీరామ్
శ్రీరామ్… యాంకర్ రవి..
యాంకర్ రవి.. ఆర్జే కాజల్..
కాజల్.. ప్రియ‌
ప్రియ.. ఆర్జే కాజల్..
ప్రియాంక.. ఆర్జే కాజల్..
శ్వేతా.. లోబో..
షణ్ముఖ్.. లోబో..
సిరి..లోబో.
యానీ మాస్టర్.. లోబో
సన్నీ.. ప్రియ.
విశ్వ.. ప్రియ..
లోబో.. ప్రియ..

ఇందులో ఎక్కువగా ఓట్లు ప్రియకు, లోబోకు ఎక్కువగా ఓట్లు పడ్డాయి. దీంతో ఇంట్లో ఉండటానికి ఎవరు మద్దతు ఇస్తారు అని అడగ్గా.. ఎక్కువగా ప్రియకు సపోర్ట్ ఇచ్చారు హౌస్ మేట్స్. తక్కువ ఓట్లు లోబోకు వ‌చ్చాయి. దీంతో అనూష్యంగా లోబోను ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించారు నాగార్జున.

దీంతో విశ్వ చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. లోబో ఏం త‌ప్పు చేశార‌ని ఎలిమినేట్ చేశార‌ని వెక్కి వెక్కి ఏడ్చాడు. తప్పు చేసిన వాళ్లు హౌస్లో ఉన్నారు. ఇలాంటి త‌ప్పు చేయ‌ని వాళ్లు ఎలిమినేట్ అయ్యార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.ఇక ఆ తర్వాత అందరికీ గుడ్ బై చెప్పేసీ.. తప్పు చేస్తే క్షమించాలిని కోరాడు లోబో. అనంత‌రం .. ఇంటి సభ్యులతో డ్యాన్స్ చేయిస్తూ.. క‌న్నీటీ ప‌ర్యంతమ‌య్యారు లోబో.

ఆ త‌రువాత ..స్టేజ్ మీదకు వచ్చి.. కింగ్ నాగ్ ను హ‌గ్ చేసుకున్నాడు లోబో. త‌న బిగ్ బాస్ జ‌ర్నీని పంచుకున్నారు. ఈ స‌మ‌యంలో అందరి గురించి పాజిటివ్ గా మాట్లాడాడు. ఆ తర్వాత తన లైఫ్ హిస్టరీ చెబుతూ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఈ స‌మ‌యంలో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ట్విస్ట్ ఇచ్చాడు నాగ‌ర్జున. ఇంటికి వెళ్తున్న లోబోను పిలిచి.. లక్కీ ఛాన్స్ ఇచ్చాడు నాగార్జున. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేసే అధికారం ఎవరికీ లేదని.. కేవలం ఆడియన్స్ కు మాత్రమే ఉందని.. వారు నిన్ను కావాలి అనుకుంటున్నార‌ని చెప్పుకొచ్చాడు.

అస‌లు ఏం జ‌రుగుతుందో లోబోకి తెలియ‌డం లేదు. కన్నీటిని ఆపుకోలేక‌పోయాడు. దీంతో స్జేజ్ పై కుప్పకూలిపోయి బోరు బోరున ఏడ్చాడు. మెజారిటీ కంటెస్టెంట్లు నువ్వు వెళ్లాల‌ని ఓటేసినందున‌ వ‌చ్చేవారం నేరుగా నామినేష‌న్స్‌లో ఉండ‌బోతున్నావ‌ని చెప్పాడు. కాక‌పోతే నువ్వు హౌస్‌లోకి కాకుండా సీక్రెట్ రూమ్‌లోకి వెళ్తున్నావ‌ని వెల్ల‌డించాడు. అక్కడే ఉండి అందరిని అబ్జర్వ్ చేయి అని చెప్పాడు.. దీంతో ముందుగా అనుకున్నట్లుగానే లోబోను ఎలిమినేట్ చేసినట్టే చేసి సిక్రేట్ రూంకు పంపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news