సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ మరో లేఖ

-

దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చెయ్యాలని, దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కు 5 పేజీల బహిరంగ లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. దళితులు సంక్షేమ పట్ల చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి అర్హులకు 10 లక్షల ఆర్ధిక సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. దళితులకు మంత్రి వర్గంలో తగిన ప్రాధాన్యత కెసిఆర్ ఇవ్వడం లేదని ఆరోపించిన బండి సంజయ్… 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా దళితులకు తెరాస పార్టీ , ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన ప్రతీ ఒక్క హామీ నెరవేర్చాలని లేఖలో పేర్కొన్నారు.

మాల సామాజిక వర్గానికి మంత్రి వర్గం లో స్థానం ఇస్తే మాదిగ సామజిక వర్గానికి ఇవ్వకుండా దళితులను కెసిఆర్ మోసగిస్తున్నారని మండి పడ్డారు. మాదిగ , మాల సామాజిక వర్గాల ఆత్మ గౌరవ భవనాలకు భూమి ఎప్పుడు కేటాయిస్తారని ప్రశ్నించిన బండి సంజయ్‌…. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు, అంబేద్కర్ టవర్స్ కు అయిదు సంవత్సరాలు క్రితం శంకుస్థాపన చేసినా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ఏడు సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఫార్మ్ హౌస్ , ప్రగతి భవన్ దాటి బయటకు వచ్చి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కు దండ వెయ్యలేదన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాను అన్ని దళితులను కెసిఆర్ నిట్టనిలువునా మోసగించారని ఫైర్‌ అయ్యారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news