సీఎం కేసీఆర్ కు ఎలక్షన్ కమిషన్ షాక్..?

హుజురాబాద్ లో సీఎం కేసీఆర్ సభ రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసీ తాజా ఆంక్షలతో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ డైలామా లో పడింది. మొదట 1000మందితో సభలకు ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే హుజురాబాద్ లో ఆంక్షలతో వరంగల్ జిల్లాలోని సరిహద్దు మండలంలో కేసీఆర్ సభకు టిఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే టిఆర్ఎస్ సభ కోసం భారీ ఏర్పాట్లు మొదలు పెట్టింది. అయితే తాజాగా ఈసీ పెట్టిన ఆంక్షలతో వరంగల్ సభకు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

KCR-TRS
KCR-TRS

మొదట 1000 మందికి అనుమతి ఇవ్వగా తాజాగా జనసమీకరణ ను ఈసీ 500కు కుదించింది. తాజా ఈసీ ఆదేశాల నేపథ్యంలో సభ పై టిఆర్ఎస్ తర్జన భర్జన పడుతోంది. ఈ నెల 27న సభ కేసీఆర్ సభకు టిఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. దాంతో హుజురాబాద్ లో కేసీఆర్ సభ రద్దయ్యే ఛాన్స్ ఉంది. దాంతో ప్లీనరీ నే హుజురాబాద్ ఎన్నికల సభ గా మలుచుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ సభ రద్దు తో హుజురాబాద్ టిఆర్ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహం నిండుతుంది.