కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో శ్రావ్య పిల్లలకు పేపర్ చూపించి తప్పు చేశావ్ ఏమో అక్కా అంటుంది. ప్రతిసారి పిల్లలకు నిజాన్ని దాచిపెట్టి అబద్ధాలు చెప్పటం కష్టం అవుతుంది అంటుంది దీప. ఆదిత్య కూడా పిల్లలకు చెప్పగలిగినన్ని నిజాలే చెప్పాలి అంటాడు. ఆనంద్ రావు సరిగ్గా అమెరికా వెళ్లేరోజు విడుదలవటం ఏంటి అంటాడు. ఇలా అందరు మోనిత గురించి అనుకుని…మీర తొందరగా ఫ్లైట్ ఎక్కితే చాలు..ఆ తర్వాత ఏం జరిగినా పర్వాలేదు అంటుంది సౌందర్య. ఆదిత్య ఈరోజుతో అన్ని కష్టాలు తీరాయ్ అనుకుందాం అంటాడు. ఒకవేళ వీళ్లు వెళ్లిపోయిన తర్వాత తను ఇంటిమీదకు వస్తుందేమో అంటుంది సౌందర్య.
మరోసీన్ లో కార్తీక్ రవి, భారతి అని పిలుచుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు. కార్తీక్ గొంతు గుర్తుపట్టిన మోనిత ఆనందంతో కార్తీక్ గొంతే కదా ఎన్నాళ్లకు విన్నాను, రేయ్ మీ నాన్నరా అంటూ లోపలికి బిడ్డకు చెబుతుంది. కింద రవి, భారతి వచ్చి ఆస్పటల్ లో కలుద్దాం అన్నాను కదా అంటాడు. ఇంట్లో ఉంటారని వచ్చానులే కాని..విడుదలైందంట కదా, భారతి మీ ఫ్రెండ్ కలిస్తే చెప్పు..మేమం అమెరికా వెళ్తున్నాం అని చెప్పు, ఇంక ఎలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దని చెప్పు, నేను ఇంక రాను అని చెప్పు అంటాడు. మోనితకు శిక్షాకాలం పూర్తికాలేదు కాబట్టి సిటీదాటటానికి వీళ్లేదు అని షరతులుపై వస్తుందికదా..కార్తీక్ వాళ్లకు ఆస్పటల్ కి వెళ్లి డ్యాంకుమెంట్స్ పై సైన్స్ చేయండి అని చెప్పి వెళ్లబోతాడు..మోనిత వచ్చి కార్తీక్ కాళ్లుపట్టుకుంటుంది. కార్తీక్ ఛీఛీ లే..ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నారా అంటాడు. రవి భయపడుతూ ఉంటాడు. ఇందాకనుచ్చి అడుగుతుంటే ఏం మాట్లాడటంలేదు., ఈ దరిద్రం తెచ్చి ఇంట్లోపెట్టుకున్నారా, ఇంత ద్రోహమా రవి అంటాడు. భారతి మోనితను లేపుతుంది. శేబాష్ భారతి ఇన్నాళ్లు నాతో మాట్లాడుతూ బాగానే హెల్ప్ చేశావ్ అంటాడు. రివి డైరెక్టుగా ఇంటికి వచ్చింది కాదనలేకపోయాం అంటాడు. కార్తీక్ డైరెక్టుగా వస్తే మొఖం మీద తలుపువేయాలి అని వాళ్లమీద ఫైర్ అవుతాడు. మోనిత రవితో ఇది మా భార్యభర్తలకు సంబంధించిన విషయం అంటుంది. కార్తీక్ కు వీరలెవల్ లో కోపం వస్తుంది..భార్యభర్తలేంటి నువ్వనుకుంటే అయిపోతుందా అంటాడు. మోనిత నా బిడ్డకు తండ్రివి నువ్వైనప్పుడు నువ్వు నాకు భర్తవే కదా..అన్ని ఒక ప్లాన్ గా, ఫథకం ప్రకారం చేశాను అంటుంది. కార్తీక్ పోయిపోయి ఆ మోనితాకే చెప్పాడు..మేము అమెరికా పోతున్నాం అని. నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావ్ కార్తీక్, నువ్వు ఎక్కడికి వెళ్లలేవు, వెళ్లనివ్వను, పద్మవ్యూహంలో బంధించాను నిన్ను అందులోంచి వెళ్లటం అసాధ్యం అంటుంది.
ఇంకోసీన్ లో దీప వచ్చి కార్తీక్ హాస్పటల్ కి వెళ్లలేదని సౌందర్యకు చెప్తుంది. ఇద్దరు ఇక ఫ్లైట్ కు వెళ్లాల్సిన టైంలో కార్తీక్ ఎటువెళ్లినట్లు అనుకుంటారు. ఎక్కడికివెళ్లారా అని వీళ్లలో వీళ్లే మాట్లాడుకుంటారు. ఒకవేళ భారతి ఇంటికి వెళ్లుంటారా అని దీప అంటుంది. సౌందర్య నువ్వే ఫోన్ చేసి, ప్రశాంతంగా మాట్లాడు, ఇంకెంతసేపు చెప్పు కొన్నిగంటలైతే ఎయిర్ పోర్టుకు వెళ్తారు. వెళ్లిఫోన్ చేసి మాట్లాడు అని దీపకు చెప్తుంది
ఇటుపక్క మోనిత నువ్వు అమెరికా ప్లాన్ చేసుకుని హాయిగా వెళ్తున్నానని అనుకుంటున్నావ్, కానీ నా ప్లాన్స్ నాకు ఉంటాయ్ కదా అంటుంది. కార్తీక్ ఏం చేస్తావ్ అంటాడు. నాకు ఇప్పటికే నాకు టీవీ ఛానల్స్ వాళ్లు ఫోన్ చేస్తున్నారు అంటుంది. చెప్పుకో, ఎవడూ నమ్మడు అంటాడు..ఇంతలో దీప ఫోన్ చేస్తుంది..దీపతో బాగా ధైర్యంగా మాట్లాడతాడు..ఈ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు..నేను వస్తున్నాను దీప..నా కోసం ఉప్మా రెడీచేసి పెట్టు అంటాడు. దీప మీరు ఉప్మా తింటారా అంటే..నేను అభిప్రాయాలు మార్చుకున్నాను అది ఈ క్షణం నుచ్చే అమలవుతుంది అంటాడు.
మోనిత నువ్వు ఈ భూమ్మీద ఎక్కడికి వెళ్లినా నీకు ప్రశాంతంగా లేకుండా చేస్తున్నాను. నేను టీవీలో ఏం మాట్లాడాలో స్క్రిట్ రాసుకుని పెట్టుకున్నాను అంటుంది. నువ్వు ఏం చెప్పినా ఎవరూ నమ్మరు అంటాడు కార్తీక్. ఎందుకు నమ్మరు అని మోనిత అంటే.. నువ్వు నేను ల్యాబ్ లో ఇచ్చిన శాంపిల్స్ తో నువ్వు గర్భం తెచ్చుకున్నావ్ కాబట్టి అంటాడు కార్తీక్..ఇక్కడే నువ్వు నాకు అద్భుతమైన పాయింట్ మిగిల్చావ్ అని అదేంటయ్యా అంటే..అసలు నువ్వు ఆ శాంపిల్ నీ ల్యాబ్ లో ఎందుకిచ్చావ్ ..నేను చెప్పానా..దీపక్కా మీద నీకు అనుమానం, ఆ పిల్లలు నీకే పుట్టారా లేదా విహారి అని చెప్పబోతుంది..కార్తీక్ మోనిత అని చేయిఎత్తుతాడు..కొడతావా కార్తీక్..కొట్టు. నా మొగిడివే కదా అంటుంది. నువ్వు పిల్లలకు, నీ భార్యకు ఆ శాంపిల్స్ ఎందుకిచ్చావో, ఇవ్వాల్సివచ్చిందో నేను ప్రపంచానికో చెప్తాను. ఇలా మోనిత ఓవర్ యాక్షన్ చేస్తుంది. వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం ఏం చెప్తావ్, చెప్పడానికి ఏం మిగలదు కదా అంటుంది. మోనిత మాటలకు కార్తీక్ ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.