టీడీపీ అధికర ప్రతినిధి పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పట్టాభిని అరెస్ట్ చేసిన సమయంలో నిబంధనలు పాటించలేదనే కారణంగా ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడింది. వేటు పడిన అధికారుల్లో విజయవాడ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ రమేష్, సీఐ నాగరాజులు ఉన్నారు. పట్టాభిని అరెస్ట్ చేసిన సమయంలో ఖాళీలతో నోటీసులు ఇవ్వడంపై మెజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాంతో ఉన్నతాధికారులు అధికారులపై చర్యలు తీసుకోనున్నారు. ఏసీపీ రమేష్ ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అంతే కాకుండా సీఐ నాగరాజును ఏలూరు డీజీపీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే పట్టాభికి కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్ పై భయటకు రాగా తన కూతురు ఇంటిపై జరిగిన దాడితో షాక్ కు గురైందని అందువల్ల తాను కుటుంబంతో కలిసి దూరంగా వెళుతున్నట్టు ప్రకటించారు.