Surya: ‘శివపుత్రుడు’ కాంబో రిపీట్.. కానీ, ఆ సినిమాలో సూర్య హీరోగా కాదట‌..!

-

Surya: తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అటు తమిళం లోనూ ఇటు తెలుగులో కూడా విభిన్న క‌థాంశంల‌తో సినిమాలు చేస్తూ.. మంచి ఇమేజ్ ను సంపాదించు కున్నాడు. తనదైన నటనతో సౌత్ ఇండియా ప్రేక్ష‌కులను ఆకట్టుకుంటాడు. ప్రేక్షకులకి సూర్య నటన అంటే మరో స్థాయి. నిజంగా సూర్య సినిమా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది.

ఆయ‌న కేరీర్ లో మైలురాయి.. నిలిచిన చిత్రం ‘పితామగన్’ . ఈ చిత్రానే తెలుగులో శివ పుత్రుడు అనే పేరుతో విడుదల చేశారు. దాదాపు రెండు దశబ్దాల క్రితం వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి దర్శకుడు బాల తెర‌కెక్కించారు. ఇందులో న‌టించి ఇటు విక్రమ్, అటు సూర్యలకు మంచి క్రేజ్ వచ్చింది. సూర్య పాత్ర ప్రేక్ష‌కుల‌కు ఎమోషనల్ గా చాలా బాగా కనెక్ట్ అయింది.

ఆ త‌రువాత.. దర్శకుడు బాలతో సూర్య మరో మూడు సినిమాల్లో నటించాడు. అవి కూడా ఆయన కెరీర్ కి బాగా కలిసొచ్చాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని అనే చాలా రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల‌ను నిజం చేస్తూ.. సూర్య ట్వీట్ చేశారు. రెండు దశాబ్దాల అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆయన దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయబోతున్నట్లు ట్వీట్ చేశారు సూర్య .

ఈ క్ర‌మంలో బాలా, తన తండ్రితో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ… నా కంటే ఎక్కువ నన్ను నమ్మిన వ్యక్తి బాలా. ఆయనతో మరో సరికొత్త ప్రయాణం ప్రారంభించ‌బోతున్నాను. దీనికి నాన్నగారి ఆశీస్సులతో తోడయ్యాయి. అంటూ ట్వీట్ చేశారు. అయితే ఆ సినిమాలో సూర్య నటించటం లేదట. అధర్వ మురళీ, కీర్తిసురేశ్ ప్రధాన పాత్రలలో నటించనున్నారట. పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news